ఓటీటీలోకి రానున్న మలయాళ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్
మలయాళ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన హార్రర్ థ్రిల్లర్ మూవీ డైస్ ఐరే.
By: Sravani Lakshmi Srungarapu | 29 Nov 2025 6:37 PM ISTమలయాళ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన హార్రర్ థ్రిల్లర్ మూవీ డైస్ ఐరే. అక్టోబర్ 31న మలయాళంలో రిలీజైన ఈ సినిమా ఆ తర్వాత వారానికి తెలుగులో కూడా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. కేవలం 6 రోజుల్లోనే రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన డైస్ ఐరే బాక్సాఫీస్ రేసును ముగించుకుని ఓటీటీలోకి వస్తోంది.
భ్రమ యుగం, భూతకాలం లాంటి హిట్ మంచి మంచి సినిమాలు తీసిన రాహుల్ సదాశివన్ డైస్ ఐరే మూవీకి దర్శకత్వం వహించగా నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ ఈ హార్రర్ థ్రిల్లర్ ను నిర్మించారు. ఈ మూవీని తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
డిసెంబర్ 5న ఓటీటీలోకి డైస్ ఐరే
అయితే డైస్ ఐరే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా, డిసెంబర్ 5 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఓటీటీలో మలయాల వెర్షన్ మాత్రమే రిలీజవుతుందా లేదా దాంతో పాటూ తెలుగు వెర్షన్ కూడా రిలీజవుతుందా అనే విషయంలో మాత్రం సదరు ఓటీటీ సంస్థ క్లారిటీ ఇవ్వలేదు.
కాగా ఆడియన్స్ మాత్రం మలయాళ వెర్షన్ తో పాటూ తెలుగు వెర్షన్ ను కూడా ఒకే రోజు రిలీజ్ చేయాలని కోరుతున్నారు. కాగా ఈ సినిమాలో ప్రణవ్ మోహన్ లాల్ తో పాటూ సుస్మితా భట్, గిబిన్ గోపీనాథ్, జయ కురూప్, అరుణ్ అజికుమార్ కీలకపాత్రల్లో నటించగా, ఈ మూవీకి క్రిస్టో జేవియర్ సంగీతాన్ని అందించారు. మరి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకున్న డైస్ ఐరే ఓటీటీలో ఎలాంటి రెస్పన్స్ ను అందుకుంటుందో చూడాలి.
