Begin typing your search above and press return to search.

'రాజా సాబ్' రూమర్స్.. ఓటీటీలోకి వస్తే గానీ..

అందుకే ఆ వీడియోలు షేర్ చేస్తూ ఫేస్ స్వాప్ వాడారా?, డూప్ షాట్స్ ఎక్కువయ్యాయా? అంటూ సోషల్ మీడియాలో అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

By:  M Prashanth   |   26 Jan 2026 10:00 PM IST
రాజా సాబ్ రూమర్స్.. ఓటీటీలోకి వస్తే గానీ..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతికి కానుకగా వచ్చిన ఆ సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. హారర్ కామెడీ జానర్‌ లో తెరకెక్కిన ఆ మూవీపై ఫస్ట్ షో నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో సినిమాకు సంబంధించిన మరో వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఫేస్ స్వాప్ రూమర్స్ తో సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ కు చెందిన వీడియోస్ ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఆ క్లిప్స్‌ లో కొన్ని చోట్ల ప్రభాస్ ఫేస్ నేచురల్ గా లేదని, డిజిటల్ టెక్నాలజీతో మార్చినట్టుగా ఉందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో హీరో ఫేస్ కాస్త భిన్నంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అందుకే ఆ వీడియోలు షేర్ చేస్తూ ఫేస్ స్వాప్ వాడారా?, డూప్ షాట్స్ ఎక్కువయ్యాయా? అంటూ సోషల్ మీడియాలో అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు ఇది టెక్నికల్ గ్లిజ్ కావచ్చని అంటుండగా.. మరికొందరు మాత్రం కావాలనే చేసిన ప్రయోగమని అనుమానిస్తున్నారు. దీంతో సినిమా మేకింగ్‌ పై అనవసరమైన డౌట్స్ అందరిలో మొదలయ్యాయి.

అదే సమయంలో సినిమా.. ఓటీటీలోకి వస్తే అసలు విషయం తెలుస్తుందంటూ అనేక మంది ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు.. థియేటర్లలో స్క్రీన్ క్వాలిటీ, లైటింగ్, ప్రొజెక్షన్ వల్ల కొన్ని లోపాలు కనిపించకపోవచ్చు. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో హై రిజల్యూషన్‌లో చూసినప్పుడు ఫేస్ స్వాప్ నిజమా? లేక ఫ్యాన్ ఎడిటింగ్ మాయేనా? అన్నది తేలిపోతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

అందుకే చాలామంది ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు మేకర్స్ మాత్రం ఫేస్ స్వాప్ రూమర్స్ పై ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఫ్యాన్ ఎడిట్స్ లేదా మార్ఫింగ్ చేసిన క్లిప్స్ అయ్యే అవకాశమే ఎక్కువ అని అభిమానులు చెబుతున్నారు. థియేటర్స్ లో మొబైల్‌ తో రికార్డ్ చేయడం వల్ల కూడా ముఖం డిస్టార్ట్ అయినట్టుగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.

ఏదేమైనా ఇప్పుడు రాజా సాబ్ మూవీపై ఫేస్ స్వాప్ రూమర్స్ రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు నిజం ఏంటన్నది ఓటీటీ రిలీజ్ తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆ చర్చ సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉండనుంది. మరి చూడాలి.. ది రాజా సాబ్ మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో.. ఫేస్ స్వాప్ రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ వస్తుందో..