OTT వీకెండ్ ప్లాన్ సెట్.. ఈ వారం రిలీజ్ అవుతున్న టాప్ సిరీస్, మూవీస్ ఇవే!
ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అలరించబోయే టాప్ మూవీస్, సిరీస్‌ల లిస్ట్ మీకోసం..
By: Madhu Reddy | 29 Jun 2026 11:29 AM ISTఈ వారం ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ లేకుండా సరికొత్త సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లు ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో 'నాగబంధం', 'రావు బహదూర్' లాంటి డిఫరెంట్ తెలుగు సినిమాలతో పాటు ఆలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' సందడి చేయబోతున్నాయి. ఇక ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ఓటీటీల్లో 15కి పైగా సరికొత్త ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అలరించబోయే టాప్ మూవీస్, సిరీస్‌ల లిస్ట్ మీకోసం..
నెట్‌ఫ్లిక్స్‌లో సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బ':
టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త ఒరిజినల్ తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బ' జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఒక దురదృష్టవంతుడైన టీచర్, అస్సలు అనుకూలంగా లేని ఒక పల్లెటూర్లో 'సెక్స్ ఎడ్యుకేషన్' బోధించాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే క్రేజీ స్టోరీతో ఈ సిరీస్ రాబోతోంది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న 'ఎనోలా హోమ్స్ సీజన్ 3' జూలై 16 న, రామ్ చరణ్ 'పెద్ది' కూడా ఇదే రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ప్రైమ్, హాట్‌స్టార్‌లో ఇంట్రెస్టింగ్ కంటెంట్:
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐశ్వర్య రాజేష్ నటించిన తెలుగు సిరీస్ 'ఇసకపట్నం' జూలై 2 నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే లేటెస్ట్ గ్లోబల్ సెన్సేషన్ ఇంగ్లీష్ మూవీ 'అబ్సెషన్' జూన్ 30 నుంచి రెంట్ మోడల్లో రాబోతోంది. ఇక మరోవైపు జియో హాట్‌స్టార్‌లో 'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ నటించిన కామెడీ డ్రామా 'మాలీవుడ్ టైమ్స్' జూలై 3 నుంచి తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో స్ట్రీమింగ్ కానుంది. మంచి కామెడీని ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ కానుంది.
జీ5, ఆహా, ఆపిల్ టీవీల హంగామా:
జీ5 ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా వస్తున్న తెలుగు సిరీస్ మర్మదేశం జూలై 3 నుంచి రానుంది. అలాగే 'ఆహా' ఓటీటీలో సరికొత్త రియాలిటీ షో టాప్ 'తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్' జూలై 3 నుంచి స్టార్ట్ కాబోతోంది. సైన్స్ ఫిక్షన్ కథలను ఇష్టపడే వారి కోసం ఆపిల్ టీవీ ప్లస్‌లో మోస్ట్ అవేటెడ్ 'సిలో సీజన్ 3' జూలై 3 నుంచి ప్రీమియర్ కానుంది. సన్ నెక్స్ట్‌లో 'హ్యాంగ్ మ్యాన్' అనే తెలుగు సినిమా కూడా జూలై 3న రిలీజ్ కాబోతోంది.
మొత్తానికి ఈ వీకెండ్ థియేటర్ లవర్స్‌తో పాటు ఓటీటీ ప్రియులకు కూడా ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అనిపిస్తోంది. సస్పెన్స్ కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్... ఇలా అన్ని జోనర్ల సినిమాలు ఈ వారం లైన్లో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్రెస్ట్‌ను బట్టి మీ ఫేవరెట్ మూవీస్ సిరీస్‌ల లిస్ట్‌ని ఇప్పుడే నోట్ చేసుకొని వీకెండ్ ఓటీటీ ప్లాన్‌ని సెట్ చేసుకోండి..
