Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీలో వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం సైతం పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, షో లు స్ట్రీమింగ్‌ అయ్యాయి.

By:  Ramesh Palla   |   22 Nov 2025 5:05 PM IST
ఈ వారం ఓటీటీలో వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఇవే..!
X

ప్రతి శుక్రవారం థియేటర్ల ద్వారా అన్ని భాషల నుంచి సినిమాలు రావడం జరుగుతూనే ఉంది. థియేటర్‌లో ఏ స్థాయిలో సినిమాలు విడుదల అవుతున్నాయో అంతకు మించి ఓటీటీ ద్వారా కంటెంట్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. థియేట్రికల్‌ రిలీజ్ అయిన సినిమాలు మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీకి వస్తున్నాయి. దాంతో థియేటర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఒక సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అదే స్థాయిలో ఓటీటీ లో ఆ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం సైతం పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, షో లు స్ట్రీమింగ్‌ అయ్యాయి. ఈ వీకెండ్‌ లో ఓటీటీ ప్రేక్షకులు పండుగ చేసుకునే స్థాయిలో కొత్త కంటెంట్‌ వారికి అందుబాటులో ఉంది. భాషతో ప్రమేయం లేకుండా చూసే ప్రేక్షకులు కచ్చితంగా ఈ వారం ఫుల్‌ మీల్స్ ను ఎంజాయ్‌ చేయవచ్చు.

ఇండియన్‌ ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ ఈ వారం స్ట్రీమింగ్‌ అయింది. ఇప్పటికే ప్రేక్షకులు ఈ వెబ్‌ సిరీస్‌ను తెగ చూస్తున్నారు. ఈ వీకెండ్‌కు అత్యధికంగా ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకులు స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. హిందీలో మాత్రమే కాకుండా ఇప్పటికే తెలుగు ఇతర సౌత్‌ భాషల్లోనూ ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్ మూడవ సీజన్‌ మొదటి రెండు సీజన్‌ల మాదిరిగానే ఆకట్టుకుంటుంది అని ప్రేక్షకులు అంటున్నారు.

అత్యంత వివాదాస్పద సినిమాలను అందించిన దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన మరో వివాదాస్పద మూవీ ది బెంగాల్‌ ఫైల్స్‌ సినిమా ఈ వారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పటికే జీ5 లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ మొదలైంది. 1946లో కోల్‌కత్తాలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ వివాదాస్పద సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ నటించిన 'బైసన్‌' సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చింది. థియేట్రికల్‌ రిలీజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న బైసన్‌ ను ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు బైసన్ సినిమా స్ట్రీమింగ్‌ మొదలైంది. నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పటికే స్ట్రీమింగ్‌ మొదలైన బైసన్‌కి మంచి స్పందన దక్కినట్లు తెలుస్తోంది.

విజయ్‌ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన నాడు సెంటర్‌ వెబ్‌ సిరీస్‌ ఈ వారం స్ట్రీమింగ్‌ అయింది. జియో హాట్‌స్టార్‌ ద్వారా ఈ వెబ్‌ సిరీస్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్ కి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. విజయ్‌ సేతుపతి అభిమానులు ఈ వెబ్‌ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఇవే కాకుండా ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో జురాసిక్‌ వరల్డ్‌ : సీజన్‌ 4, డైనింగ్‌ విత్‌ ది కపూర్స్‌ షో, హోంబౌడ్‌ హిందీ మూవీ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌లో డ్రీమ్‌ ఈటర్‌, స్టిచ్ హెడ్‌, వైలెంట్ ఎండ్స్‌, ఆఫ్టర్ ది హంట్‌, యూనివర్సరీ అనే ఇంగ్లీష్ సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

తెలుగు సినిమాలు కర్మణే వాధికారస్తే సినిమా సన్‌నెక్ట్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలు, సిరీస్‌ల కొత్త ఎపిసోడ్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవై నుంచి ఇరవై అయిదు వరకు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ మొదలు అయ్యాయి. కనుక ఈ వారం వీకెండ్‌ ను ఓటీటీ కంటెంట్‌ తో ఎంజాయ్ చేయవచ్చు.