వీకెండ్ జాతర: ఆదర్శ కుటుంబం- గరివిడి లక్ష్మి ఓటీటీలో
నవంబర్ చివరి వారాంతంలో ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’, ప్రైమ్ వీడియోలో ‘గరివిడి లక్ష్మి’ విడుదల కానున్నాయి. ‘హనుమాన్ అన్ష్’, హిందీ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’తో పాటు అంతర్జాతీయ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి.
By: Sivaji Kontham | 27 Nov 2026 9:32 AM ISTనవంబర్ చివరి వారాంతంలో సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ వేదికలపై భారీ సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే పలు ఆసక్తికర చిత్రాలు ఈ వీకెండ్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ప్రధానంగా ఆదర్శకుటుంబం, గరివిడిలక్ష్మి, హనుమాన్ అంశ్, హిందీ దృశ్యం వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్ `ఆదర్శ కుటుంబం: హౌస్ నెం: 47 - ఏకే 47` తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వెర్షన్లలో నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుండటం విశేషం. అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవే ఐదు భాషల్లో `గరివిడి లక్ష్మి` చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సన్ నెక్స్ట్‌లో `ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్` తమిళం, తెలుగు వెర్షన్లలో విడుదలవుతోంది. వెంకటేష్ లాంటి అగ్ర హీరో సినిమాతో పాటు.. ఉత్తరాంధ్ర కళాకారిణి గరివిడి లక్ష్మి కథపై తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు.
అలాగే హిందీలో సంచలన విజయం సాధించిన `దృశ్యం: ది కన్‌క్లూజన్` నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా, బ్లాక్ బస్టర్ `హనుమాన్ అన్ష్` చిత్రం హిందీలో సోనీలివ్‌లోనూ.. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లోనూ సందడి చేయనుంది. వీటితో పాటు ఈటీవీ విన్‌లో `అదినాశం వెల్లపొక్కం` (తెలుగు), కన్నమ్మ (కథాసుధ స్టోరీస్), ఆహా వీడియోలో `రాత్రి`` తమిళ, తెలుగు సిరీస్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
హాలీవుడ్- అంతర్జాతీయ కంటెంట్ ఇష్టపడే వారి కోసం ఈ వారం పండగే అని చెప్పాలి. నవంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో భారీ యాక్షన్ చిత్రం `స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే` (ఇంగ్లీష్), జపనీస్ యానిమే సిరీస్ `ఫూల్ నైట్` ..`ది హంటింగ్ వైవ్స్` స్ట్రీమింగ్ ప్రారంభమయ్యాయి. అంతకుముందే నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రేజీ సైన్స్-ఫిక్షన్ సిరీస్ `బ్లేడ్ రన్నర్ 2099` తెలుగు సహా పలు భాషల్లో వచ్చింది. కొరియన్ సిరీస్ `నైన్ టు సిక్స్` అందుబాటులోకి రాగా.. జియో హాట్‌స్టార్‌లో `మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్ సీజన్ 2` ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.
డిక్, ఫ్రమ్, వన్ లాస్ట్ ఆర్డర్, ది మస్కిటో బౌల్, ది చైల్డ్, ది హంచ్‌బ్యాక్: సోల్ ఆఫ్ పారిస్, ది ఘోస్ట్ అండ్ ది గన్, స్మర్ఫ్స్ వంటి విభిన్న చిత్రాలు క్యూలో ఉన్నాయి. అలాగే ఢిల్లీ 2021, ఆక్టోపస్, సత్యమేవ, కార్పొరేట్ లవ్ స్టోరీ సిరీస్‌లతో పాటు, లయన్స్‌గేట్ ప్లేలో ది స్ట్రేంజర్స్: చాప్టర్ 1 అండ్ 2, ఏప్రిల్ ఎక్స్ వంటి వైవిధ్యమన సిరస్ లతో ఈ వారాంతం వినోదానికి కొదవేమీ లేదు. కొన్ని కొత్త సినిమాలు రెంటల్ బేసిస్ లోను అందుబాటులోకి వచ్చాయి.
