వీకెండ్స్ లో సందడి చేస్తోన్న ఓటీటీ మూవీస్/సిరీస్ లివే!
వీకెండ్స్ లేదా హాలిడేస్ వచ్చాయంటే చాలు సినీ ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
By: Madhu Reddy | 13 Jun 2026 12:36 PM ISTవీకెండ్స్ లేదా హాలిడేస్ వచ్చాయంటే చాలు సినీ ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి ఫ్యామిలీతో కలిసి సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే పెరిగిన ధరలు కారణంగా ఫ్యామిలీతో కలిసి థియేటర్ కి వెళ్లాలంటే అత్యంత కష్టంతో, ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఓటీటీలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము అంటే ఏడాది పాటు నిర్విరామంగా నచ్చిన జానర్ లో నచ్చిన సినిమాను చూసే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలోనే అటు ఓటీటీలు కూడా ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి భిన్న విభిన్నమైన జానర్ లలో సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ వీకెండ్స్ లో కూడా ప్రేక్షకులను అలరించడానికి టాలీవుడ్ ను మొదలుకొని హాలీవుడ్ , ఫ్రెంచ్ వరకు ఎన్నో చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. మరి ప్రేక్షకులను ఈ వారం అలరించడానికి ఓటీటీలోకి వచ్చిన ఆ చిత్రాలు/ సీరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నెట్ ఫ్లిక్స్: హారర్ మూవీ నుండి స్పోర్ట్స్ సిరీస్ వరకు..
ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ లో హారర్ మూవీ నుండి స్పోర్ట్స్ సిరీస్ వరకు ప్రతిదీ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ వీకెండ్స్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన చిత్రాలు/ సిరీస్ లు విషయానికి వస్తే హిందీ సినిమా భూత్ బంగ్లా, స్పానిష్ మూవీ ఐ యామ్ ఫ్రాంకెల్డా, హాలీవుడ్ సిరీస్ అవుట్ లాస్ట్ ది జంగిల్, ది పాలిగమిస్ట్ వెబ్ సిరీస్ తో పాటు హాలీవుడ్ సిరీస్ ది రెస్ట్ ఈజ్ ఫుట్బాల్ సీజన్ 1 వరకు ఇలా పలు చిత్రాలు/ సీరిస్ లు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ లో డబ్బింగ్ చిత్రాల సందడి...
మరో ప్రముఖ ఓటీటీ దిగ్గజంగా నిలిచిన అమెజాన్ ప్రైమ్ లో ఈ వీకెండ్స్ డబ్బింగ్ చిత్రాల సిరీస్ ల సందడి నెలకొంది. అందులో భాగంగానే తెలుగు డబ్బింగ్ సిరీస్ రాఖ్ తో పాటు ఇటీవల తమిళంలో సూర్య హీరోగా నటించి.. థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని.. రూ.305 కోట్లకు పైగా కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన కరుప్పు చిత్రం.. తెలుగులో వీరభద్రుడు పేరిట డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు హాలీవుడ్ మూవీ విజిల్ , ఓవర్ యువర్ డెడ్ బాడీ, చిత్రాలతో పాటు హాలీవుడ్ సిరీస్ ఎవరీ ఇయర్ ఆఫ్టర్, ఫ్రెంచ్ మూవీ డాగ్ 51 సినిమా కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
హాలీవుడ్ సిరీస్ లతో జోరందుకున్న జియో హాట్ స్టార్..
ఇకపోతే ఈసారి జియో హాట్ స్టార్ లో హాలీవుడ్ సిరీస్ ల హవా ఎక్కువగా కొనసాగుతోంది. అలైస్ అండ్ స్టీవ్ సీజన్ వన్ తో పాటు బిలో డెక్ మెడిటేరియన్ సీజన్ 11 కూడా అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు తెలుగు డబ్బింగ్ చిత్రం ద్రిదమ్ కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఇక ఇక్కడే కాకుండా ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా లో తెలుగు సిరీస్ ష్ సీజన్ 3 అందుబాటులోకి రాగా.. జీ 5 లో హిందీ రియాలిటీ షో మై హూ నా, బెంగాలీ సిరీస్ తార్ఖతా అందుబాటులోకి వచ్చాయి. ఇక అలాగే తెలుగు సినిమా రమణి కళ్యాణం సన్ నెక్స్ట్ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మొత్తానికి అయితే మీకు నచ్చిన సినిమాను ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి చూసేసి ఈ వీకెండ్స్ ను మరింత ఎంజాయ్ చేయండి.
