Begin typing your search above and press return to search.

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

సాధారణంగా సోమవారం వచ్చిందంటే చాలు ఆ వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి అటు థియేటర్లలో ఇటు ఓటిటిలలో ఎలాంటి చిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి అనే ఆత్రుత సినీ ప్రేక్షకులలో ఎక్కువగా ఉంటుంది.

By:  Madhu Reddy   |   3 Nov 2026 11:23 PM IST
ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?
X

సాధారణంగా సోమవారం వచ్చిందంటే చాలు ఆ వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి అటు థియేటర్లలో ఇటు ఓటిటిలలో ఎలాంటి చిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి అనే ఆత్రుత సినీ ప్రేక్షకులలో ఎక్కువగా ఉంటుంది. ఈ వారం కూడా ప్రత్యేకించి ఓటీటీలలో ప్రేక్షకులను అలరించడానికి కొన్ని చిత్రాలు, సిరీస్ లు సిద్ధమైపోయాయి. ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ ఒక్క వారమే ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి రావడం గమనార్హం. మరి ఏ చిత్రం? ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో సినిమాల జాతర..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ గా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ మొదటివారం సినిమాల జాతర మొదలయ్యింది. ఆసక్తికరమైన చిత్రాలు స్ట్రీమింగ్ కావడమే కాకుండా విభిన్నమైన వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి. ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్ అయిన 'బాస్ ఎక్స్ మెషినా' నవంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కి రాబోతోంది. అలాగే నవంబర్ 4వ తేదీన వెబ్ సిరీస్ 'అనస్తీసియా', ఇంగ్లీష్ చిత్రం 'ఏ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్', డాక్యుమెంటరీ సిరీస్ 'టేకెన్: నటాలి హాలోవే' స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. నవంబర్ 5వ తేదీన 'బ్లాక్ డోవ్స్' అనే ఇంగ్లీష్ సిరీస్ తో పాటు, 'నార్త్ ఆఫ్ ది నార్త్ ' రెండవ సీజన్ అలాగే 'దిల్వాలే దివాళి' అనే హిందీ చిత్రం కూడా స్ట్రీమింగ్ కి రానున్నాయి. నవంబర్ 6వ తేదీన కొలంబియన్ సిరీస్ అయిన 'అండర్ సీజ్', కొరియన్ చిత్రం 'పాజిబుల్ లవ్', బెంగాలీ సిరీస్ 'కౌరీబురీర్ మందిర్' వంటి విభిన్న కథాంశాలతో రూపొందిన కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

జియో హాట్ స్టార్ లో ఏమి చూడవచ్చు?

నవంబర్ మొదటివారం జియో హాట్ స్టార్ లో ఏం చూడవచ్చు అనే విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' నవంబర్ 6 నుండి అందుబాటులోకి రానుంది. కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి నహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు. మలయాళం తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి రానుంది.. అలాగే నవంబర్ 2న 'మినియన్స్ అండ్ మాన్ స్టర్స్" అనే ఇంగ్లీష్ చిత్రంతో పాటు ' ది గిల్డజ్ ఏజ్ ' రెండో సీజన్ కూడా స్ట్రీమింగ్ కి రానుంది. నవంబర్ 6న 'ఐయామ్ గేమ్' తెలుగు డబ్బింగ్ చిత్రంతోపాటు నవంబర్ 8న 'మోటు పత్లు అండ్ మిస్టర్ ఆఫ్ ఏ నాగమణి' తెలుగు డబ్బింగ్ చిత్రం కూడా అందుబాటులోకి రానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ మజా..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 4న 'ది గ్రేటెస్ట్' అనే ఇంగ్లీషు సిరీస్ స్ట్రీమింగ్ కి రానుండగా.. మరోవైపు సిద్ధార్థ్, తమన్న కాంబినేషన్లో వచ్చిన ఫాంటసీ థ్రిల్లర్ 'ది వాన్' నవంబర్ 6న స్ట్రీమింగ్ కి రాబోతోంది. నవంబర్ 8న 'ది ఇన్స్టిట్యూట్' 2వ సీజన్ కూడా స్ట్రీమింగ్ కి రానుంది.

సన్ నెక్స్ట్ లో తెలుగు చిత్రం..

విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం 'అనకాపల్లి' నవంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది.

జీ 5:

జీ ఫైవ్ లో నవంబర్ 4న హిందీ చిత్రం 'బ్లైండ్ గేమ్' తో పాటు నవంబర్ 6న 'నూర్ కోడివానవల్' అనే తమిళ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానున్నాయి.

సోనీ లివ్ లో నవంబర్ 6న 'మీసయ్య మురుక్కు' తెలుగు డబ్బింగ్ చిత్రంతో పాటు 'హైవాన్' అనే హిందీ చిత్రం కూడా స్ట్రీమింగ్ కి రాబోతోంది.