ఈవారం ఓటీటీలో సందడి చేయబోయే చిత్రాలివే!
సాధారణంగా కొన్ని సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలయితే.. మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతూ ఉంటాయి.
By: Madhu Reddy | 27 Oct 2025 12:12 PM ISTసాధారణంగా కొన్ని సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలయితే.. మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతూ ఉంటాయి. ఇంకొన్ని చిత్రాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలు లేదా ఎనిమిది వారాలకు ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తూ ఉంటాయి. ఇక థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేని ఎంతోమంది ప్రేక్షకులు ఓటీటీ లోని సినిమాలు చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ , మాస్, థ్రిల్లర్, హారర్, కామెడీ ఇలా ఏ జానర్ కావాలంటే ఆ జానర్లో కుటుంబంతో కలిసి సినిమా చూసే అవకాశాన్ని ఈ ఓటీటీలు కలిగిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న చిత్రాలు ఏంటి? వెబ్ సిరీస్ ఏంటి? ఏ ప్లాట్ ఫామ్ లో ఏ చిత్రం / వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఈవారం ఓటీటీలో అలరించబోయే చిత్రాలు/ వెబ్ సిరీస్ లు ఇవే..
నెట్ ఫ్లిక్స్:
ఇడ్లీ కడై :
ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన చిత్రం ఇడ్లీ కడై . ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో తిరు సినిమా వచ్చి మంచి విజయాన్ని అందించింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఇడ్లీ కడై సినిమా వచ్చింది. కుటుంబ విలువలు, కులతత్వం, వారసత్వం , వ్యాపారాలను చూపించిన ఈ సినిమాలో తండ్రి వారసత్వమైన ఇడ్లీ కొట్టును కాపాడే యువకుడి కథగా చూపించారు. ఇక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 29 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
బాలాద్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్ :
కోలిన్ ఫరెల్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం ఇది . ఐరిష్ కాన్ ఆర్టిస్ట్ జీవితంలో జరిగే మానసిక, ఆధ్యాత్మిక పోరాటాన్ని కథాంశంగా తెరకెక్కించారు.. అక్టోబర్ 29 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ది విచర్ సీజన్ 4:
బాప్టిజం ఆఫ్ ఫైర్ అనే నవల ఆధారంగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంత్ర శక్తులు, రాజకీయం నేపథ్యంలో తెరకెక్కింది. అక్టోబర్ 31 తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
హెడ్డా - అక్టోబర్ 29
బాఘీ 4 - అక్టోబర్ 31
ది హోమ్ - అక్టోబర్ 31
జీ 5:
మారిగళ్ళు - అక్టోబర్ 31
బై తుఝ్యాపాయి - అక్టోబర్ 31
జియో హాట్ స్టార్:
మేగన్ 2.0 - అక్టోబర్ 27
ఐటీ: వెల్కమ్ టు డెర్రీ - అక్టోబర్ 27
కొత్త లోక చాప్టర్ 1: చంద్ర - అక్టోబర్ 31
