మండే వేసవిలో మే 3వ వారం సందడి చేయనున్న ఓటీటీ మూవీస్ ఇవే!
మరి ఎప్పటిలాగే మే మూడవ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన సీరీస్లు, సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 18 May 2026 1:00 PM ISTసూర్య భగవానుడి తాపానికి బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో థియేటర్కు వెళ్లి సినిమా చూసే ప్రయత్నం చేస్తారా అంటే కాస్త కష్టం అని చెప్పాలి..అందులో భాగంగానే తాజాగా ఈ సమ్మర్ సెలవులను మరింత క్యాష్ చేసుకోవడానికి అటు ఓటీటీలు కూడా విభిన్నమైన జానర్ లలో సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రేక్షకులను ఇంటికే పరిమితం చేస్తూ.. టీవీలకే కట్టిపడేస్తున్నాయి. ఇక అందులో భాగంగానే మండే వేసవిలో ఈ సోమవారం నుండి ఈవారం మొత్తం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి వివిధ ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారం లు సిద్ధం అయిపోయాయి.
మరి ఎప్పటిలాగే మే మూడవ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన సీరీస్లు, సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. యాక్షన్ పర్ఫామెన్స్ నుంచి హిందీ సిరీస్ వరకూ..
ప్రముఖ ఓటీటీ దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. మే 20వ తేదీన యాక్షన్ ప్రియుల కోసం ఒక అద్భుతమైన సినిమాను తీసుకురాబోతోంది. అదే 'జ్యాక్ రాన్.. ఘోస్ట్ వార్'..ఇంటర్నేషనల్ సీక్రెట్ మిషన్ ఒక ప్రాణాంతకమైన కుట్రను బయటపెట్టినప్పుడు.. తిరుగుబాటు చేస్తున్న ఒక బ్లాక్ ఆప్స్ విభాగాన్ని ఎదుర్కోవడానికి రాన్ తిరిగి గూఢచార ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం తెలియాలి అంటే ఈ యాక్షన్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక అలాగే సోనాక్షి సిన్హా, జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సిస్టమ్ అనే హిందీ సినిమా మే 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ రెండు చిత్రాలతో పాటు హాలీవుడ్ మూవీ ది క్రోనిన్స్ ది మమ్మీ మే 19వ తేదీన స్ట్రీమింగ్ కి రానుండగా.. అలాగే ఒక తమిళ సినిమా మే 20వ తేదీన స్ట్రీమింగ్ కి రాబోతోంది.
ఈవారం మొత్తం హాలీవుడ్ సిరీస్ లతో సందడి చేయనున్న నెట్ ఫ్లిక్స్..
ఇకపోతే ఎప్పుడూ కూడా భాషతో సంబంధం లేకుండా ప్రతి వారం అన్ని భాషల సినిమాలను అందిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే నెట్ ఫ్లిక్స్.. ఈ వారం మాత్రం పూర్తిగా హాలీవుడ్ సిరీస్ లకి పెద్దపీట వేసింది. అలా మే 20 నుంచీ మే 22 వరకు సుమారుగా 8 కి పైగా హాలీవుడ్ చిత్రాలు, సీరీస్ లు స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి డెజిబ్లింగ్ సీజన్ -1 హాలీవుడ్ సిరీస్ మే 20న స్ట్రీమింగ్ కి వస్తుండగా.. కరీజ్మా సీజన్ వన్ (స్పానిష్ సిరీస్) మే 21న నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవడానికి సిద్ధం అయ్యింది. అలాగే హాలీవుడ్ సిరీస్ వన్ త్రీ హిల్ మే 21న, జేమ్స్ సీజన్ వన్ (స్పానిష్ సిరీస్) మే 21న, లేడీస్ ఫస్ట్ హాలీవుడ్ మూవీ మే 22 , దిస్ ఈజ్ నాటా టెస్ట్ హాలీవుడ్ మూవీ మే 22న అలాగే మేటింగ్ సీజన్ (హాలీవుడ్ సిరీస్ మే 22న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నాయి.
నెట్ సన్ నెక్స్ట్ లో సందడి చేయనున్న మెగా కోడలు..
మెగా కోడలు నిహారిక సతీ లీలావతి సినిమాతో సన్ నెక్స్ట్ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ తెలుగు సినిమా మే 20వ తేదీన స్ట్రీమింగ్ కి రానుంది. అలాగే మే 22న మలయాళం మూవీ బీష్మార్, మే 22న కన్నడ సినిమా శేష 2016 సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి.
ఇక మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ విషయానికి వస్తే జియో హాట్ స్టార్ వేదికగా మే 22న తెలుగు సీరీస్ మేము కాపులం సినిమా స్ట్రీమింగ్ కి రానుంది. అలాగే సోనీ లివ్ లో మలయాళం మూవీ మధుమిత మే 22న అందుబాటులోకి రానుంది .ఇలా ఈ వారం కొత్త సినిమాలు, కొత్త సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాయి.
