Begin typing your search above and press return to search.

ఫిబ్రవరి 2వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు/ సిరీస్ లివే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా. ఈసారి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Madhu Reddy   |   9 Feb 2026 12:02 PM IST
ఫిబ్రవరి 2వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు/ సిరీస్ లివే!
X

ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను ఓటీటీ వేదికగా అలరించడానికి కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి..ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 15 వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు, వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ప్రైమ్ వీడియోలో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' స్ట్రీమింగ్ అవుతుండగా.. జియో హాట్ స్టార్ లో 'ది రాజా సాబ్' చిత్రం కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ వారం మరో రెండు సంక్రాంతి హిట్ మూవీలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరొక సినిమా డైరెక్టర్గా ఓటీటీలోకి రాబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా. ఈసారి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.375 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. హీరోయిన్గా నయనతార నటించగా.. విక్టరీ వెంకటేష్ కీలకపాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వేదికగా ఫిబ్రవరి 11 నుండి తెలుగు , తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

సంక్రాంతి రేసులో నిలిచిన మరో చిత్రం 'అనగనగా ఒక రాజు' . నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా.. రావు రమేష్ కీలక పాత్రలో వచ్చిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 11 నుండి ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇకపోతే మరొక సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలకు సిద్ధమవుతోంది. అదే 'సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని'. ఈటీవీ విన్ వేదికగా ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రీమియర్ కానుంది ఈ ఒరిజినల్ సినిమా. ఇందులో లయ , శివాజీ మళ్లీ జంటగా నటిస్తున్నారు.

తెలుగు చిత్రాలే కాదు మలయాళ సినిమాలు కూడా..

ఇకపోతే మలయాళీ మెడికో థ్రిల్లర్ 'బేబీ గర్ల్' స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు స్ట్రీమింగ్ కి రానుంది.

అలాగే జియో హాట్ స్టార్ ఓటీటీలో నివిన్ పౌలి హీరోగా నటించిన 'సర్వం మాయా' సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

అంతేకాదు మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో సంచలనం సృష్టించిన సౌబీన్ షాహీర్ 'పాతి రాత్రి' సినిమా కూడా ఫిబ్రవరి 13 నుండి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

అలాగే మరో మళయాల చిత్రం 'నీలకంఠ' కూడా సన్ నెక్స్ట్ వేదికగా ఈ వారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లో విషయానికి వస్తే.. హారర్ థ్రిల్లర్ 'ది కంజూరింగ్: లాస్ట్ నైట్స్' జియో హాట్ స్టార్ వేదికగా ఫిబ్రవరి 13న స్ట్రీమింగ్ కానుంది.

ఇటాలియన్ డ్రామా సిరీస్ 'మోటార్ వ్యాలీ ' కూడా నెట్ ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.