Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ సందడి

తెలుగు సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Ramesh Palla   |   18 Oct 2026 3:31 PM IST
ఈ వారం ఓటీటీ సందడి
X

దసరా కానుకగా ఈ వారం చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్దకు వచ్చాయి. థియేటర్లలో కొన్ని సినిమాలు సందడి చేస్తుంటే, కొన్ని సినిమాలకు ఆదరణ కరువు అయ్యింది. దసరా సెలవుల్లో టాలీవుడ్‌ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ దసరా పండుగ సందర్భంగా పలు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి, మరికొన్ని స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. తెలుగు సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా మోస్ట్‌ అవైటెడ్‌ వెబ్‌ సిరీస్‌లకు సంబంధించిన కొత్త సీజన్‌లు సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కనుక ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు దసరా పండుగ సందర్భంగా సందడే సందడి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్‌...

ఈవారం స్ట్రీమింగ్‌ కాబోతున్న ఓటీటీ సినిమాలు సిరీస్‌ల విషయానికి వస్తే సూపర్‌ హిట్‌ తమిళ్‌ మూవీ 'డీసీ' ని నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. లోకేష్ కనగరాజ్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా రోజుల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డీసీ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా ఈ వారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో డీసీ స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇంకా మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ఆశా ను జీ5 లో ఈ వారం నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. సీనియర్‌ నటి ఊర్వశి, జోజూ జార్జ్‌, ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగులో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఇంకా జియో హాట్‌స్టార్‌లో విజయ్‌ క్వెస్ట్‌ అనే ఇంగ్లీష్ మరియు తెలుగు వెబ్‌ సిరీస్‌ కొత్త సీజన్‌ రాబోతుంది. కాలనీ అనే మూవీ కొరియన్‌, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఎన్నవిలై అనే తెలుగు సినిమాను...

ఇంకా ఈవారం నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్నవిలై అనే తమిళ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుంది. హౌటు ట్రైన్‌ యువర్‌ డ్రాగన్‌ అనే ఇంగ్లీష్ మూవీ ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా రాబోతుంది. అంతే కాకుండా ది ట్రాప్ అనే ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్ సైతం ఈవారంలో స్ట్రీమింగ్‌ కానుంది. టైసన్ అనే ఇంగ్లీష్ మూవీని తెలుగులో నెట్‌ఫ్లిక్స్ ఈవారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో కుకూన్స్ అనే మూవీ తెలుగులో స్ట్రీమింగ్‌ కానుంది. హకుమ్‌ ను సైతం ఇంగ్లీష్, తెలుగులో ప్రైమ్‌ వీడియో స్ట్రీమింగ్‌ చేయబోతుంది. కాగితం పడవలు అనే తెలుగు సినిమాను ఈవారం సన్‌ నెక్ట్స్‌ స్ట్రీమింగ్‌ చేయనుంది. ఈటీవీ విన్‌లో నల్లజెర్ల రోడ్ అనే మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈటీవీ విన్‌లో ఈ సినిమా మాత్రమే కాకుండా పలు షో లు సైతం కొత్త ఎపిసోడ్స్ రాబోతున్నాయి.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌...

ఇక ఆహా ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల ముందుకు సుగ్రీవ అనే తెలుగు మూవీ రాబోతుంది. విభిన్నమైన కథ, కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. కనుక ప్రేక్షకులు ఆహాలో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకా ఆహాలో వసుదేవ సుతం అనే మూవీ సైతం స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇది సైతం తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని ఆహా వారు చెబుతున్నారు. దహాన్ అనే ఒక ఒడియా సినిమాను తెలుగులో స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆహా రెడీ చేసింది. ఈ సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాలు, సిరీస్‌లు, షో లు ప్రేక్షకులను అలరించేందుకు వరుసగా క్యూ కట్టబోతున్నాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోని కంటెంట్‌ను చూసే వారికి ఈ వారం పండుగే పండగా.