ఈ వారం ఓటీటీ కొత్త రిలీజులు!
ఓటీటీలోకి కొత్త సినిమాల కబుర్లను తీసుకొస్తూ మరో కొత్త వారం వచ్చేసింది.
By: Sravani Lakshmi Srungarapu | 4 Aug 2025 4:30 PM ISTఓటీటీలోకి కొత్త సినిమాల కబుర్లను తీసుకొస్తూ మరో కొత్త వారం వచ్చేసింది. ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అందులో కొన్ని తప్పక చూడాల్సినవి కూడా ఉన్నాయి. అవేంటో, ఏ ప్లాట్‌ఫామ్ లో అవి రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
మయసభ
తెలుగు రాష్ట్రాల్లోని దిగ్గజ పొలిటీషియన్ల కథ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కిందని అందరూ చెప్పుకుంటున్న వెబ్ సిరీసే మయసభ. వైఎస్సార్, చంద్ర బాబు నాయుడుల కథనే ఇది అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సిరీస్ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుండగా ఆది పినిశెట్టి, చైతన్య రావు ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.
మోతెవరి లవ్‌స్టోరీ
తెలంగాణ మట్టి వాసనను అందరికీ చాటి చెప్పే ప్యూర్ కామెడీ లవ్ స్టోరీగా గా ఈ సిరీస్ తెరకెక్కింది. మనుషుల్లోని ప్రేమానుబంధాలతో పాటూ పల్లెటూరి వాతావరణాన్ని కూడా ఇందులో చాలా బాగా చూపించారని అర్థమవుతుంది. యూట్యూబర్ అనిల్ జీల ఇందులో హీరోగా నటించగా ఆగస్ట్ 8 నుంచి జీ5లో ఈ సిరీస్ తెలుగుతో పాటూ ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
పరందు పో
ముద్దుల కొడుకు అన్బును పోషించడానికి తన స్తోమతకు మించి జీవితాన్ని కొనసాగిస్తున్న గోకుల్ అనే వ్యక్తి గురించి తీసిన తమిళ కామెడీ డ్రామాగా ఇది రూపొందింది. అప్పు వసూలు చేసే వాళ్లు వెంటపడుతున్నప్పటికీ, తన ఫ్యామిలీ లైఫ్ ను నిలబెట్టుకోవడానికి గోకుల్ ఎలా కష్టపడతానే నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా జియో హాట్‌స్టార్ లో ఆగస్ట్ 5 నుంచి అందుబాటులోకి రానుంది.
లవ్ హర్ట్స్
ఒక రియల్టర్ కథగా తెరకెక్కిన లవ్ హర్ట్స్, తన గత ప్రేయసిని కలిసినప్పుడు తన హింసాత్మక గతంలోకి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఆమెను కాపాడటానికి అతను చేసే ప్రమాదకరమైన జర్నీ గురించి తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ఆగస్ట్ 7 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అరేబియా కడలి
తండేల్ మూవీ లాంటి కథతో ఓటీటీలో రాబోతున్న అరేబియా కడలి ఆగస్ట్ 8 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది. సత్యదేవ్ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటూ ఇతర భాషల్లోనూ రిలీజ్ కానుంది.
ఓహె ఎంతన్ బేబీ
తమిళ రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఆగస్ట్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
మామన్
సూరి ప్రధాన పాత్రలో నటించిన తమిళ డ్రామా గ్రిప్పింగ్ స్టోరీతో గ్రామీణ వాస్తవికతతో తెరకెక్కింది. మామన్ ఆగస్ట్ 8 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది.
సూపర్ హిట్ సిరీస్ వెడ్‌నెస్ డే సీజన్2, పార్ట్ 1 ఆగస్ట్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
