ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. ఒక్కరోజే 22!
ముఖ్యంగా కామెడీ , హారర్, యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
By: Madhu Reddy | 26 Sept 2025 12:02 AM ISTబుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి మళ్లీ శుక్రవారం వచ్చేసింది. ప్రతి శుక్రవారం అటు థియేటర్లలోనే కాకుండా ఇటు ఓటీటీలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతూ ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా ఓటీటీలోకి సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా కామెడీ , హారర్, యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా హృదయపూర్వం చిత్రాలు అభిమానులలో అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే .
ఇదిలా ఉండగా రేపు ఒక్కరోజే మొత్తం 22 చిత్రాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. అందులో ప్రత్యేకించి ఈ మూడు చిత్రాలను మిస్ అవ్వకండి అంటూ అభిమానులు కూడా చెబుతున్నారు. మరి రేపు ఒక్కరోజే అంటే సెప్టెంబర్ 26వ తేదీన ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
జియో హాట్ స్టార్:
హృదయపూర్వం.. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ , మాళవిక కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాతో మోహన్ లాల్ హ్యాట్రిక్ కూడా అందుకున్నారు. అలాంటి ఈ సినిమా రేపు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
అమెజాన్ ప్రైమ్:
ఘాటీ.. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటించిన యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం ఇది. ఘాటీలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా రేపు స్ట్రీమింగ్ కానుంది.
మా దేవా ( కన్నడ మూవీ)
నెట్ ఫ్లిక్స్ :
ధడక్ 2 (హిందీ సినిమా)
సన్నాఫ్ సర్దార్ (హిందీ సినిమా)
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (మలయాళం మూవీ)
ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్)
అలైస్ (ఇంగ్లీష్ సిరీస్)
హౌస్ ఆఫ్ గిన్నిస్ (ఇంగ్లీష్ సిరీస్)
మాంటిస్ (దక్షిణ్ కొరియన్ మూవీ)
ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్ మూవీ)
రుత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్ మూవీ)
క్రైమ్ సీన్ జీరో (కొరియన్ వెబ్ సిరీస్)
సన్ నెక్స్ట్:
దూర తీర యానా (కన్నడ మూవీ)
మేఘాలు చెప్పిన ప్రేమ కథ (తెలుగు మూవీ)
జీ 5:
జనావర్: ద బీస్ట్ వితిన్ (హిందీ సిరీస్)
సుమతి వళవు (మలయాళ మూవీ)
ఆపిల్ ప్లస్ టీవీ:
ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)
ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్)
లయన్స్ గేట్ ప్లే:
డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ మూవీ)
మనోరమ మ్యాక్స్:
సర్కీత్ (మలయాళ మూవీ)
హుళు :
ద మ్యాన్ ఇన్ మై బేస్మెంట్ (ఇంగ్లీష్ మూవీ)
ఇలా మొత్తం 22 చిత్రాలు సెప్టెంబర్ 26వ తేదీన పలు ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. ఇందులో ప్రత్యేకించి తెలుగు నుండి ఘాటీ, మలయాళం నుంచి హృదయపూర్వం, సుమతి వళవు చిత్రాలు మాత్రం మిస్ అవ్వకండి అని ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
