Begin typing your search above and press return to search.

గ్లోబల్‌గా ఇది పవర్‌ స్టార్‌ స్టామినా..!

పవన్‌ కళ్యాణ్ హీరోగా సాహో సుజీత్‌ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Ramesh Palla   |   29 Oct 2025 3:06 PM IST
గ్లోబల్‌గా ఇది పవర్‌ స్టార్‌ స్టామినా..!
X

పవన్‌ కళ్యాణ్ హీరోగా సాహో సుజీత్‌ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెగ్యులర్‌ సినీ ప్రేక్షకులు పెదవి విరిచినా, పవన్‌ కళ్యాణ్‌ వీరాభిమానులు మాత్రం ఓజీ సినిమాను నెత్తిన ఎత్తుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల పాటు ఓజీ ఫీవర్‌ ఓ రేంజ్‌ లో ఊపేసిన విషయం తెల్సిందే. ఓజీ సినిమాను కేవలం ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా దర్శకుడు సుజీత్‌ రూపొందించిన తీరు, దానికి తమన్‌ అందించిన సంగీతం మరో లెవల్‌ అన్నట్లుగా చెప్పుకోవచ్చు. తమన్‌ ప్రతి సీన్‌కు ఇచ్చిన ఎలివేషన్ చూసి చాలా మంది షాక్ అయ్యారు. పవన్‌ ఫ్యాన్స్‌ ను ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఊపేసింది ఎవరూ లేరు అంటూ తమన్‌, సుజీత్‌ గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఓజీ ఓటీటీలో సందడి చేస్తోంది.

పవన్‌ కళ్యాణ్ ఓజీ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌...

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఓజీ సినిమా స్ట్రీమింగ్‌ ఇప్పటికే మొదలైంది. థియేట్రికల్‌ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ మొదలు పెట్టింది. థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో చూసిన ప్రేక్షకులు, చూడని ప్రేక్షకులు అంతా కూడా నెట్‌ఫ్లిక్స్‌ లో ఓజీ ని తెగ స్ట్రీమింగ్‌ చేయడం ఖాయం అని మొదటి నుంచే అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఓటీటీ లో ఓజీ సినిమాకు అద్భుతమైన స్పందన దక్కింది. నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన స్టాట్స్ ప్రకారం 23 అక్టోబర్‌ నుంచి 26 అక్టోబర్‌ వరకు ఏకంగా 3.2 మిలియన్‌ల వ్యూస్ ఓజీ సినిమా సొంతం చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లో ఈ స్థాయి వ్యూస్ రాబట్టడం ద్వారా పలు సినిమాల ఆల్‌ టైమ్‌ వ్యూస్‌ ను ఈ సినిమా క్రాస్ చేసిందని ఓటీటీ విశ్లేషకులు, సోషల్‌ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌ లో ఓజీ సందడి

ఇక ఇండియాలో హిందీ భాష చిత్రాలతో పాటు ఇతర భాషల చిత్రాలను వెనక్కి నెట్టి ఓజీ సినిమా నెం.1 స్థానంలో నిలిచింది. ఓజీ సినిమాను ఓటీటీలో అత్యధికులు చూస్తున్నారు అనేందుకు మరో నిదర్శనం 11 దేశాల్లో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ టాప్‌ మూవీస్ జాబితాలో చోటు సొంతం చేసుకోవడం. ఇండియా కాకుండా ఇతర దేశాల్లో ఒక తెలుగు సినిమాను చూడటం విశేషం. అలాంటిది ఏకంగా 11 దేశాల్లో తెలుగు సినిమా టాప్‌ 10 లో నిలిచింది అంటే ఓజీ సత్తా ఏంటో, పవన్‌ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్లోబల్‌గా నాన్ ఇంగ్లీష్ మూవీస్ లిస్ట్‌ లో టాప్ 5 లోనూ ఓజీ ఉండటం విశేషం. ఇంతగా ఓజీ ని నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. ఓజీ సినిమా థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో దక్కించుకున్న విజయం కంటే ఓటీటీలో దక్కించుకున్న విజయం పెద్దది అంటూ ఈ నెంబర్స్‌ ను చూపిస్తూ పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ప్రియాంక అరుల్‌ మోహన్ హీరోయిన్‌గా..

హరిహర వీరమల్లు సినిమా నిరుత్సాహ పరిచిన నేపథ్యంలో కాస్త అనుమానాలు, అంచనాల మధ్య విడుదలైన ఓజీ సినిమా పూర్తి స్థాయిలో ఫ్యాన్‌ మూవీగా నిలిచింది. దాదాపు నాలుగు ఏళ్లు మేకింగ్‌ లోనే ఉన్న ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదల కావడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్‌, ఇమ్రాన్‌ హస్మీ ఇలా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు నటించారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆమె పాత్ర చిన్నదే అయినా లుక్ పరంగా, నటన పరంగా ఆమె ఆకట్టుకుంది. గ్యాంగ్‌ స్టర్‌ సినిమాలు అంటే ఇష్టపడే పవన్‌ కళ్యాణ్‌ తనకు నచ్చిన పాత్రకు ఏ స్థాయిలో ప్రాణం పెడుతాడో మరోసారి నిరూపితం అయ్యింది. అందుకే ఓజీ సినిమా ఈ రేంజ్‌ లో నెంబర్స్ ను నమోదు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.