ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయబోయే చిత్రాలివే!
ప్రతి వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో రిలీజ్ అవుతూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 13 Oct 2025 4:24 PM ISTప్రతి వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో రిలీజ్ అవుతూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే అక్టోబర్ మూడవ వారానికి సంబంధించి కొన్ని సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో విడుదల అవడానికి సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్న సినిమాలు ,వెబ్ సిరీస్ లు ఏంటి థియేటర్లలో ఏ చిత్రాలు వస్తున్నాయి? అటు ఓటీడీలో ఏ ప్లాట్ఫారం ద్వారా ఏ సినిమా , వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతున్నాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు..
మిత్రమండలి..
టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్. ఎమ్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మిత్రమండలి. ఎస్. విజయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, సత్య, వెన్నెల కిషోర్ , విష్ణు ఓయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈనెల 16వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది.
తెలుసు కదా..
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా కాంబినేషన్లో రాబోతున్న చిత్రం తెలుసు కదా.. నీరజ కోన దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
డ్యూడ్:
కోలీవుడ్ యంగ్ హీరోగా , డైరెక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న చిత్రం డ్యూడ్. లవ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో మమితాబైజు హీరోయిన్గా నటిస్తోంది. కీర్తిస్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్, నేహా శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 17వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ కానుంది.
కె -ర్యాంప్:
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్న లవ్ కామెడీ ఎంటర్టైనర్ కె ర్యాంప్.. జేమ్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. నరేష్ , సాయికుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం సందడి చేయనున్న ఓటీటీ సినిమాలు / వెబ్ సిరీస్..
ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు/వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.
నెట్ ఫ్లిక్స్:
ది డిప్లొమ్యాట్ సీజన్ 3 - అక్టోబర్ 16
గుడ్ న్యూస్ - అక్టోబర్ 17
ది ఉమెన్ ఇన్ క్యాబిన్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్
స్విమ్ టు మీ
బూట్స్ సీజన్ 1
ది చూసేన్
నీరో
ది రిస్సరెక్టడ్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్
విక్టోరియా బెక్ హ్యామ్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్
ట్రూ హంటింగ్ - ఇంగ్లీష్ / హిందీ డాక్యుమెంటరీ
అమెజాన్ ప్రైమ్ వీడియో:
పరమ్ సుందరి
ది మలబార్ టేల్స్ (కన్నడ మూవీ)
రిప్పాన్ స్వామి (కన్నడ మూవీ)
మెయింటెనెన్స్ రిక్వైర్డ్ (ఇంగ్లీష్ / తెలుగు మూవీ)
ది థికెట్ (ఇంగ్లీష్ మూవీ)
టు డై అలోన్ ( ఇంగ్లీష్ మూవీ)
వెడ్డింగ్ ఇంపాజిబుల్: సీజన్ 1 వెబ్ సిరీస్
ఆహా :
ఆనందలహరి - వెబ్ సిరీస్ (అక్టోబర్ 17)
జీ 5:
కిష్కింధపురి - అక్టోబర్ 17
భగవత్ - వెబ్ సిరీస్ అక్టోబర్ 17
