Begin typing your search above and press return to search.

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఒకేసారి స్ట్రీమింగ్‌కు వచ్చిన కొత్త సినిమాలు!

శ్రీవిష్ణు, ఆది సాయికుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్స్ నటించిన సినిమాలు ఇప్పుడు మీ ఇంట్లోనే కూర్చుని చూసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఆ కొత్త సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం..

By:  Madhu Reddy   |   30 Oct 2026 2:31 PM IST
ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఒకేసారి స్ట్రీమింగ్‌కు వచ్చిన కొత్త సినిమాలు!
X

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే పండగ.. థియేటర్లలో అలరించిన హిట్ సినిమాలతో పాటు క్రైమ్, యాక్షన్, హారర్, రొమాన్స్ మరియు గ్యాంగ్‌స్టర్ డ్రామా వంటి విభిన్న జానర్లకు చెందిన పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అక్టోబర్ 30న ఒకేసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చేశాయి. శ్రీవిష్ణు, ఆది సాయికుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్స్ నటించిన సినిమాలు ఇప్పుడు మీ ఇంట్లోనే కూర్చుని చూసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఆ కొత్త సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం..

అమెజాన్ ప్రైమ్‌లో ‘కామ్రేడ్ కళ్యాణ్’ అండ్ ‘మిర్జాపూర్’:

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జనకిరామ్ మరెళ్ల దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కామ్రేడ్ కళ్యాణ్' అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక దీనితో పాటు థియేటర్లలో సంచలనం సృష్టించిన పాపులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'మిర్జాపూర్: ది మూవీ' (పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ) కూడా ప్రైమ్‌లోనే డిజిటల్ లవర్స్ ముందుకు వచ్చింది.

నెట్‌ఫిక్స్‌లో ‘ఎస్ఐ యుగంధర్’ అండ్ ‘సిగ్మా’:

ఆది సాయికుమార్, మేఘలేఖ జంటగా రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ఎస్ఐ యుగంధర్' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యి ఐదు భాషల్లో అలరిస్తోంది. అలాగే సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా జేసన్ సంజయ్ తెరకెక్కించిన యాక్షన్ క్రైమ్ అడ్వెంచర్ మూవీ 'సిగ్మా' కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే తమిళ్, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

కీర్తి సురేశ్-రాధికా ఆప్టేల ‘అక్క’ వెబ్ సిరీస్:

కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన పీరియడ్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ సిరీస్ 'అక్క'. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ క్రేజీ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇక థ్రిల్లర్ డ్రామాలు ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్.

సోనీ లివ్‌లో హారర్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’:

ఇక తమిళ్ యంగ్ సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ జంటగా మరియప్పన్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ 'ఇమ్మోర్టల్'. ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక మొత్తానికి చూస్తే, ఈ వారాంతంలో ఓటీటీ వీక్షకులకు కావాల్సినంత వినోదం సిద్ధంగా ఉంది. ఇక యాక్షన్, కామెడీ, హారర్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలు ఇలా ఏ జానర్ నచ్చినా సరే హ్యాపీగా ఇంటి వద్దే కూర్చుని ఈ కొత్త సినిమాలను, సిరీస్‌లను చూసి ఎంజాయ్ చేసేయవచ్చు.