ఈవారం ఓటీటీలో సందడి చేయబోతున్న చిత్రాలివే!
ఎప్పటిలాగే ప్రతి వారం కూడా అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో సినిమాలు సిద్ధమవుతున్నాయి.
By: Madhu Reddy | 1 Dec 2025 11:33 AM ISTఎప్పటిలాగే ప్రతి వారం కూడా అటు థియేటర్లలో ఇటు ఓటీటీలలో ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో సినిమాలు సిద్ధమవుతున్నాయి. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, స్పై , థ్రిల్లర్, హారర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జానర్లలో చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 1..ఈ ఏడాది ఆఖరి నెల ప్రారంభం అయింది. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఏకంగా చాలా చిత్రాలే సిద్ధం అయిపోయాయి. మరి ఓటీటీలలో ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఏ ఏ చిత్రాలు.. ఏ ఏ ప్లాట్ ఫారమ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
నెట్ ఫ్లిక్స్:
ది గర్ల్ ఫ్రెండ్..
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న , కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో డిసెంబర్ 5వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ సిద్ధమవుతోంది.
మై నెక్స్ట్ గెస్ట్ విత్ డేవిడ్ లేటర్ మ్యాన్ - డిసెంబర్ 1
ట్రోల్ 2 - డిసెంబర్ 1
ది సీన్ కాంబో - డిసెంబర్ 2
విత్ లవ్ మేఘన్ హాలిడే సెలెబ్రేషన్ - డిసెంబర్ 3
ది అంబంధన్స్ - డిసెంబర్ 4
జాయ్ కెల్లీ - డిసెంబర్ 5
స్టీఫెన్ - డిసెంబర్ 5
ది నైట్ మై డాడ్ సేవ్ క్రిస్మస్ 2 - డిసెంబర్ 5
జీ 5:
బి డూన్ టీన్ - డిసెంబర్ 5
పరియా - డిసెంబర్ 5
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో - డిసెంబర్ 5
ఘర్వాలి పెద్వాలి - డిసెంబర్ 5
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓహ్ వాట్ ఫన్ - డిసెంబర్ 3
థామా - డిసెంబర్ 2
ఆపిల్ టీవీ :
ది హంట్ - డిసెంబర్ 3
సోనీ లివ్ :
కుట్రం పురిందవన్ - డిసెంబర్ 5
జియో హాట్ స్టార్ :
డీయస్ ఈరే - డిసెంబర్ 5
ది హెరిటేజ్ - డిసెంబర్ 7
