Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ : ఏకంగా 13 తెలుగు సినిమాలతో..

2020లో ఎప్పుడైతే కరోనా మహమ్మారి విజృంభించిందో.. అప్పుడు దాదాపు థియేటర్లన్నీ మూతపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.

By:  Madhu Reddy   |   17 Jan 2026 11:48 AM IST
నెట్ ఫ్లిక్స్ : ఏకంగా 13 తెలుగు సినిమాలతో..
X

2020లో ఎప్పుడైతే కరోనా మహమ్మారి విజృంభించిందో.. అప్పుడు దాదాపు థియేటర్లన్నీ మూతపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. ప్రజలు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి సమయంలో ఓటీటీల హవా భారీగా పెరిగిపోయింది. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండలేక చాలామంది తమకు నచ్చిన సినిమాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేయడానికి ఓటీటీలను ఆశ్రయించారు. అప్పటినుంచి ఓటీటీ ఆదరణ పెరిగిపోవడంతో ఇప్పుడు థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా కూడా విడుదలైన 4 వారాలు లేదా 8 వారాలలోనే ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని పంచుతున్నాయి.

ఇకపోతే మొన్నటి వరకు రిలీజ్ కి ముందు సదరు సినిమా నిర్మాతలు ఓటీటి సంస్థలతో డీలు కుదుర్చుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓటీటీ డీల్ ని కూడా పూర్తి చేసుకుంటున్నారు. పైగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను విడుదల చేస్తూ ఉండడం గమనార్హం.. అలా తమతో డీల్ కుదుర్చుకొని ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది. ఇందులో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ లాంటి దిగ్గజ హీరోల సినిమాలతో పాటు రోషన్ మేక, విశ్వక్ సేన్ లాంటి చిన్న హీరోల సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఒకరకంగా చెప్పాలి అంటే నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా 13 తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం.

ఈ ఏడాది ప్రముఖ ఓటీడీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించబోతున్న చిత్రాల జాబితా విషయానికి వస్తే..

1. ఉస్తాద్ భగత్ సింగ్ :

(పవన్ కళ్యాణ్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా.. హరీష్ శంకర్ దర్శకత్వం)

2. పెద్ది:

(రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా.. బుచ్చిబాబు సనా దర్శకత్వం)

3. ది ప్యారడైజ్:

(నాని , సోనాలి కులకర్ణి, మోహన్ బాబు కాంబినేషన్ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న చిత్రం)

4. ఆదర్శ కుటుంబం: హౌస్ నెంబర్ 47:

(విక్టరీ వెంకటేష్ ,శ్రీనిధి శెట్టి జంటగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం)

5. ఆకాశంలో ఒక తార:

(పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా సాత్విక వీరవల్లి హీరోయిన్గా వచ్చిన చిత్రం)

6. ఛాంపియన్:

(రోషన్ మేక హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్గా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వచ్చిన చిత్రం)

7. ఫంకీ:

(విశ్వక్ సేన్ హీరోగా, కాయాదు లోహర్ హీరోయిన్ గా అనూప్ కె.వి దర్శకత్వంలో వస్తున్న చిత్రం)

8. రాకాస:

(సంగీత్ శోభన్ హీరోగా, నయానా సారిక హీరోయిన్గా.. మానసా శర్మ దర్శకత్వంలో నిహారిక నిర్మిస్తున్న చిత్రం ఇది)

9. బైకర్:

(శర్వానంద్ హీరోగా, రాజశేఖర్ కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు)

10. VD 14(విజయ్ దేవరకొండ 14వ చిత్రం)

(విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా రాబోతున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు)

11. మ్యాడ్ జూనియర్స్

12. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ దర్శకత్వం వహించే చిత్రం.

13. ఫహద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్

ఈ చిత్రాలు అన్నీ ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతున్నాయి.