బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
బిగ్‌బాస్ రియాలిటీ షోలో వివాదాలు కొత్తేమీ కాదు. అయితే ఈసారి మలయాళ బిగ్‌బాస్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
By: Priya Chowdhary Nuthalapti | 2 Nov 2026 12:20 PM ISTబిగ్‌బాస్ రియాలిటీ షోలో వివాదాలు కొత్తేమీ కాదు. అయితే ఈసారి మలయాళ బిగ్‌బాస్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ కంటెస్టెంట్ ప్రేమ వ్యవహారం, తల్లిదండ్రుల అభ్యంతరాలు, చివరకు ఆమె షో నుంచి బయటకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో నేహా ఫాతిమా, సంతోష్ రాజ్ మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మొదట స్నేహంగా మొదలైన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇటీవల నేహా ఫాతిమా బిగ్‌బాస్ హౌస్‌లోనే సంతోష్ రాజ్‌కు తన ప్రేమను వ్యక్తం చేసింది. సంతోష్ కూడా ఆమె ప్రేమను అంగీకరించడంతో వీరిద్దరి లవ్ ట్రాక్ షోలో హైలైట్‌గా మారింది.
అయితే ఈ ప్రేమ వ్యవహారం నేహా తల్లిదండ్రులకు నచ్చలేదని తెలుస్తోంది. వీకెండ్ ఎపిసోడ్లో నేహా తల్లిదండ్రులు షోలోకి వచ్చి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
తమ కుమార్తె నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. నేహాను ఇంటికి తీసుకెళ్లాలని కోరడంతో షోలో అందరూ ఆశ్చర్యపోయారు. ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు నేహా, మధ్యలో సంతోష్.. ఈ పరిస్థితిని హోస్ట్ మోహన్‌లాల్ నిర్వహించాల్సి వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో నేహా ఫాతిమా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. దీంతో ఆమె జర్నీ అనూహ్యంగా ముగిసింది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దయ్యాక తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు వ్యక్తులకు ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రుల భావాలను కూడా గౌరవించాలని అంటున్నారు.
అయితే ఈ ఘటన నిజంగానే జరిగిందా? లేక షో రేటింగ్ కోసం రూపొందించిన డ్రామానా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
t
