Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి నారా రోహిత్ సుందరకాండ!

ప్రముఖ హీరో, నిర్మాత, రాయకీయ వారసులు నారా రోహిత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   18 Sept 2025 10:19 AM IST
ఓటీటీలోకి నారా రోహిత్ సుందరకాండ!
X

ప్రముఖ హీరో, నిర్మాత, రాయకీయ వారసులు నారా రోహిత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చాలా సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన చివరిగా 'ప్రతినిధి 2' సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇక చాలాకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ లతో కలిసి 'భైరవం' అంటూ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు 'సుందరాకాండ' అంటూ మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నారా రోహిత్ హీరోగా, ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీలో వచ్చిన ఈ సినిమాలో వృతి వాఘని మరో హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 27వ తేదీన విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అయితే రాబట్టలేదు.

ఇకపోతే విడుదలయ్యి నెల కూడా కాలేదు అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది. అలా సెప్టెంబర్ 23వ తేదీ నుండి జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.థియేటర్లలో చూడని వారు ఓటీటీలో సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు. మొత్తానికైతే సుందరకాండ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన నారా రోహిత్.. ఇటు ఓటీటీ లో ఎలాంటి రేటింగ్ సొంతం చేసుకుంటారో చూడాలి. ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. జియో హాట్ స్టార్.. "ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవు" అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ షేర్ చేసింది.

సుందరకాండ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 సంవత్సరాల వయసు దాటిపోయి ఏళ్లయినా పెళ్లి చేసుకోడు. స్కూల్లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి (శ్రీదేవి) ని ప్రేమిస్తాడు. ఆమెలో కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా నచ్చుతాయి. పెద్దైన తర్వాత కూడా అలాంటి లక్షణాలున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఒక రూల్ పెట్టుకుంటాడు. అందులో భాగంగానే ఎన్నో సంబంధాలు వస్తాయి.. అమ్మాయిలని చూస్తాడు.. కానీ తనకు కావలసిన లక్షణాలు లేవని రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

అయితే ఒకసారి ఎయిర్పోర్టులో ఐరా (వృతి వాఘని) ను చూస్తాడు. ఆ అమ్మాయిలో తనకు నచ్చిన కొన్ని లక్షణాలు ఉన్నాయని ఆమె వెంట పడతాడు. తనను ప్రేమించేలా చేసుకుంటాడు కూడా.. ఆఖరికి ఈ ప్రేమ కథ సుఖాంతం అయ్యిందా? ముఖ్యంగా వీరిద్దరి ప్రేమను ఆ అమ్మాయి ఇంట్లో ఒప్పుకున్నారా? ఆ ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరి మధ్య పరిచయం ఎలా కుదిరింది? ఇలా పలు విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇందులో నరేష్, కమెడియన్ సత్య కామెడీ ట్రాక్ రిలీఫ్ గా అనిపిస్తుంది. వాసుకి తో పాటు సునైన బాదం వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.