Begin typing your search above and press return to search.

చిరు టాక్‌ షో.. సెకండ్‌ ఎపిసోడ్‌ వీళ్లతోనే!

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న చిరంజీవి టాక్ షో ‘చిరంజీవిస్ మెగావర్స్’పై ఆసక్తి పెరుగుతోంది. తొలి ఎపిసోడ్‌లో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ సందడి చేసినట్లు సమాచారం. రెండో ఎపిసోడ్‌లో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 20న వీరిద్దరూ షూటింగ్‌కు డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌తో స్టార్స్ చేసే సందడి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

By:  Ramesh Palla   |   14 Nov 2026 9:56 PM IST
చిరు టాక్‌ షో.. సెకండ్‌ ఎపిసోడ్‌ వీళ్లతోనే!
X

మెగాస్టార్ చిరంజీవి టాక్ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. నెట్‌ఫ్లిక్స్‌ లో చిరంజీవిస్ మెగావర్స్ అనే పేరుతో చిరంజీవి టాక్‌ షో ను అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ టాక్‌ షో ను తన గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ భారీ మొత్తంలో చిరంజీవి టాక్ షో కి పే చేస్తున్నట్లుగానూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ ఉంది. చిరంజీవి టాక్‌ షో అంటే గెస్ట్‌లకు కొదవ ఉండదు. అందరి వాడిగా మంచి పేరు సొంతం చేసుకున్న చిరంజీవి పిలిస్తే వెళ్లేందుకు ఎంతో మంది టాలీవుడ్‌ స్టార్స్ రెడీగా ఉంటారు. అందుకే అద్భుతమైన ఎపిసోడ్స్‌ లోడింగ్‌ కాబోతున్నాయని మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇటీవలే నాగార్జున గెస్ట్‌గా ఎపిసోడ్‌ చిత్రీకరణ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపించింది. ఆ ఎపిసోడ్‌ చాలా ఆసక్తికరంగా వచ్చిందని ఆఫ్ ది రికార్డ్‌ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

నాగార్జున గెస్ట్‌గా చిరంజీవి టాక్‌ షో...

నాగార్జునతో చిరంజీవి జరిపిన చిట్‌ చాట్‌ నెవ్వర్‌ బిఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది. చిరంజీవి, నాగార్జున మధ్య మంచి సన్నిహిత్యం ఉంటుంది. ఇంతకు ముందు చాలా సార్లు వీరిద్దరూ ఎదురు ఎదురుగా కూర్చుని మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక టాక్‌ షో కోసం మాత్రం మొదటి సారి వీరిద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు. నాగార్జున తో పాటు నాగ చైతన్య, అఖిల్‌ సైతం చిరంజీవి టాక్‌ షో లో సందడి చేశారని తెలుస్తోంది. చివరి 15 నిమిషాల పాటు నాగ చైతన్య, అఖిల్‌ ఉంటారు. ఇంకా అక్కినేని ఫ్యాన్స్‌ సైతం కొందరు టాక్‌ షో లో పాల్గొంటారని, చాలా విభిన్నంగా టాక్‌ షో సాగుతుందని అంటున్నారు. మెగా టాక్ షో అంటే అంచనాలు చాలా ఉంటాయి. కనుక అందుకు తగ్గట్లుగానే రెగ్యులర్‌ టాక్‌ షో ల మాదిరిగా కాకుండా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మొదటి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కింగ్‌ 100 సినిమా ప్రమోషన్స్‌...

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయింది కనుక నాగార్జున ఎపిసోడ్‌ కచ్చితంగా త్వరలోనే స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున 100వ సినిమా కింగ్‌ 100 ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ ఉండే అవకాశం ఉంది. కనుక కింగ్‌ 100 సినిమా విడుదలకు ముందే మెగా టాక్‌ షో ను స్ట్రీమింగ్‌ చేస్తారని తెలుస్తోంది. నాగ్‌ 100 సినిమాకు ప్రమోషన్ అయినట్లు ఉంటుంది, మెగా ఎపిసోడ్‌లో నాగ్ సందడి చేసినట్లు ఉంటుందని ప్లాన్‌ చేసి ఉంటారు. ఇక ఈ టాక్‌ షో రెండో ఎపిసోడ్‌ లో ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడట. ప్రభాస్‌ తో పాటు చిరంజీవిని ఎంతో అభిమానించే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సైతం టాక్‌ షో లో సందడి చేస్తాడని అంటున్నారు. ఇంకా షూట్‌ జరగలేదు, కానీ ఇప్పటికే డేట్లు ఇచ్చారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

చిరంజీవితో ప్రభాస్‌, సందీప్ రెడ్డి వంగ...

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్‌ 20న చిరంజీవి టాక్ షో కోసం ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగ డేట్‌ కేటాయించారని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి స్పిరిట్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మెగా టాక్ షో లో స్పిరిట్‌ కు సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంతకు ముందు బాలకృష్ణ టాక్‌ షో లో ప్రభాస్‌ కనిపించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో గోపీచంద్‌ తో కలిసి ప్రభాస్‌ అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో లో పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్‌ కి మంచి స్పందన వచ్చింది. ప్రభాస్‌ ను బాలకృష్ణ సరదాగా పలు విషయాలను గురించి అడగడం, కొన్ని విషయాల్లో మొహమాట పెట్టడం వంటివి చేశాడు. ఆ ఎపిసోడ్‌ కు మించి ఉండేలా ప్రభాస్‌ ఎపిసోడ్‌ ను చిరంజీవిస్ మెగావర్స్ క్రియేట్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. చిరంజీవి, ప్రభాస్ మధ్య ఉన్న అనుబంధం కారణంగానూ ఎపిసోడ్‌ లో మంచి వినోదం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే చిరంజీవి కమెడియన్స్‌ తో ఒక ఎపిసోడ్‌ కి సంబంధించిన షూట్‌ పూర్తి చేశారని సమాచారం. ఆ ఎపిసోడ్‌ కాస్త ఆలస్యంగానే స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.