Begin typing your search above and press return to search.

మిర్జాపూర్‌ మూవీ వచ్చింది.. కానీ రాలేదు!

ఇండియన్‌ ఓటీటీ ప్రేక్షకులకు మిర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

By:  Ramesh Palla   |   30 Oct 2026 6:52 PM IST
మిర్జాపూర్‌ మూవీ వచ్చింది.. కానీ రాలేదు!
X

ఇండియన్‌ ఓటీటీ ప్రేక్షకులకు మిర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ వెబ్ సిరీస్‌ ఇప్పటి వరకు మూడు సీజన్‌లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సీజన్‌ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అయిన సమయంలో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. వారం రోజుల తర్వాత సోషల్‌ మీడియాలో ప్రైమ్‌ వీడియోలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంటూ, ట్రెండింగ్‌ లో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ వెబ్‌ సిరీస్‌లను మించి ఉందంటూ చాలా మంది కామెంట్స్‌ చేశారు. యూత్‌ ఆడియన్స్ టార్గెట్‌గా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ మాస్ జనాల్లోకి విపరీతంగా వెళ్లింది. నార్త్‌ ఇండియా సౌత్‌ ఇండియా అనే తేడా లేకుండా అన్ని చోట్ల మీర్జా పూర్‌ గురించి చర్చ జరిగింది. బూతులు, అశ్లీల సన్నివేశాలు ఉన్నప్పటికీ మీర్జాపూర్‌ ను అత్యధికులు చూడటంతో సీజన్‌ 2, సీజన్‌ 3 లు సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మిర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌..

మిర్జాపూర్‌ సందడి 2018లో మొదలైంది. అప్పటి నుంచి 2024లో విడుదలైన సీజన్‌ 3 వరకు కొనసాగుతూనే వచ్చింది. సీజన్‌ 4 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా మిర్జాపూర్‌ యూనిట్‌ నుంచి సినిమా ప్రకటన వచ్చింది. కొత్త కథ కానీ మిర్జాపూర్‌ నేపథ్యం నుంచి తీసుకున్న కథ కావడం తో ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. పాత్రలు అవే, నేపథ్యం అదే కావడంతో వెబ్‌ సిరీస్‌ను చూసిన వారు చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు. దాంతో మిర్జాపూర్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెబ్‌ సిరీస్‌ తో పోల్చితే బూతులు కాస్త తక్కువగా ఉన్నాయి, అంతే కాకుండా అశ్లీలత కూడా కాస్త తగ్గించడం జరిగింది. థియేట్రికల్‌ రిలీజ్ అయిన సినిమాను చూడలేక పోయిన ప్రేక్షకులు ఓటీటీలో చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ మొదలైంది.

మిర్జాపూర్‌ సినిమా విడుదల...

మిర్జాపూర్‌ సినిమా తెలుగులో డబ్ అయ్యి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా తెలుగు లో పోటీగా ఉన్న సినిమాలను సైతం వెనక్కి నెట్టింది. దాంతో తెలుగు ప్రేక్షకుల్లో కొందరు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సైలెంట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ మిర్జాపూర్‌ ను స్ట్రీమింగ్‌ మొదలు పెట్టిన విషయం తెలిసి చాలా మంది తెలుగు వర్షన్‌ కోసం వెతికారు. మీర్జాపూర్‌ ఓటీటీ లో వచ్చింది, కానీ తెలుగులో రాలేదు అని తెలిసి చాలా మంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు మిర్జాపూర్‌ ను వెబ్‌ సిరీస్‌గా చూడని వారు సైతం సినిమాగా చూడాలని భావించారు. కానీ తెలుగులో విడుదల స్ట్రీమింగ్‌ కాకపోవడంతో సోషల్‌ మీడియా ద్వారా అమెజాన్‌ ప్రైమ్‌ పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు.

ఓటీటీలో మిర్జాపూర్‌ మూవీ...

ఇప్పటి వరకు వచ్చిన మిర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ లు తెలుగులో స్ట్రీమింగ్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా తెలుగులో డబ్‌ అయ్యి థియేటర్లలో విడుదల అయింది. కానీ ఎందుకు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ అవుతున్న మీర్జాపూర్‌ సినిమాను తెలుగు వర్షన్‌ అందుబాటులో ఉంచలేదు అర్థం కావడం లేదు. ఇప్పటికే ఈ విషయమై చాలా మంది ప్రైమ్‌ వీడియోను సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. అతి త్వరలోనే వారి నుంచి ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో లేదా మరికొన్ని రోజుల్లో మిర్జాపూర్‌ తెలుగు వర్షన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కావడం ఖాయం. ప్రేక్షకులు నిరుత్సాహపడుకుండా వెయిట్‌ చేయాల్సిందే. ఇప్పటికే కొందరు హిందీ వర్షన్‌ చూడటం మొదలు పెట్టారు. మిర్జాపూర్‌ ను తెలుగులో చూడటం కోసం ఎదురు చూస్తున్న వారిలో మీరు ఉన్నారా..?