మార్చి ఫస్ట్ వీక్.. ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు/ సిరీస్ లివే
నెట్‌ఫ్లిక్స్ నుండి ఆహా వరకు అన్ని ప్లాట్‌ఫారమ్స్ కొత్త కంటెంట్‌తో రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం మీ వీకెండ్ ప్లాన్ ఏంటో ఒకసారి చూసేయండి..
By: Madhu Reddy | 2 March 2026 7:52 PM ISTచూస్తూ వుంటే కాలం ఇట్టే గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే 2026లో రెండు నెలలు గడిచిపోయాయి..మార్చి నెల వచ్చేసింది, ఈ వారం సినీ వినోద ప్రియులకు పండగే అని చెప్పాలి. థియేటర్లలో మృత్యుంజయ్, సతీ లీలావతి వంటి వెరైటీ టైటిల్స్ ఉన్న సినిమాలు సందడి చేయబోతుండగా, ఓటీటీ ప్రియుల కోసం 13కు పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు క్యూ కట్టాయి. నెట్‌ఫ్లిక్స్ నుండి ఆహా వరకు అన్ని ప్లాట్‌ఫారమ్స్ కొత్త కంటెంట్‌తో రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం మీ వీకెండ్ ప్లాన్ ఏంటో ఒకసారి చూసేయండి..
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో క్రేజీ అప్‌డేట్స్:
ఈ వారం ఓటీటీ దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే చిత్రాలతో వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 6 నుంచి 'విత్ లవ్' అనే తెలుగు డబ్బింగ్ సినిమాతో పాటు, 'హలో బచ్చోన్' అనే హిందీ సిరీస్, 'వార్ మెషీన్' అనే ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ విషయానికొస్తే, మార్చి 3నే 'తన్వి ద గ్రేట్' అనే హిందీ సినిమా వచ్చేస్తోంది. దీనితో పాటు 'యంగ్ షెర్లాక్' సిరీస్ మార్చి 4, 'సుబేదార్' మార్చి 5 న ఇంట్రెస్టింగ్ కంటెంట్ అందుబాటులోకి రానుంది. వైవిధ్యమైన కథలను ఇష్టపడే వారికి ఈ వారం ప్రైమ్ మరియు నెట్‌ఫ్లిక్స్ మంచి ఆప్షన్స్ అని చెప్పాలి.
తెలుగు సినిమాల సందడి.. ‘ఆహా’ నుంచి ‘జీ5’ వరకు:
మన తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'ఆహా'లో మార్చి 4 నుంచి 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే చిత్రం డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. అలాగే జీ5లో మార్చి 6న 'గాంధీ టాక్స్' అనే తెలుగు డబ్బింగ్ మూవీతో పాటు 'జబ్ కూలీ కితాబ్' అనే హిందీ సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఇక హాట్‌స్టార్‌లో 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అనే తెలుగు సిరీస్ మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇవే కాకుండా సన్ నెక్స్ట్ లో డియర్ రథి, గ్రానీ వంటి తమిళ్ సినిమాలు కూడా అదే రోజున రాబోతున్నాయి. సోనీ లివ్‌లో 'లాలో కృష్ణ సదా సహాయతే' అనే సినిమా మార్చి 6న విడుదల కానుంది.
రవితేజ సినిమా కోసం ఎదురుచూపులు.. ఇంకా సస్పెన్సే:
ఇక సంక్రాంతి రేసులో థియేటర్లలోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇక సాధారణంగా నెల రోజుల్లోనే ఓటీటీలోకి రావాలి కానీ, ఈ సినిమా విషయంలో కాస్త ఆలస్యమైంది. బహుశా ఈ మార్చి మొదటి వారంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోకి సర్ప్రైజ్‌గా వచ్చేస్తుందేమో చూడాలి. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ మాస్ ఎంటర్టైనర్ ఎప్పుడు వస్తుందా అని సోషల్ మీడియాలో ఫాన్స్ తెగ వెతికేస్తున్నారు. మరోవైపు మార్చి 13 న వస్తుందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వారం రవితేజ నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందేమో వేచి చూడాల్సిందే..
