Begin typing your search above and press return to search.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయిన కే- ర్యాంప్.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు అలా థియేటర్లలో విడుదలవుతాయో లేదో ఇలా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   8 Nov 2025 1:28 PM IST
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయిన కే- ర్యాంప్.. ఎప్పుడు, ఎక్కడంటే?
X

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు అలా థియేటర్లలో విడుదలవుతాయో లేదో ఇలా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ, ఎమోషనల్, హారర్ , క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ ఇలా జోనర్ ఏదైనా సరే ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో సంతోషంగా సినిమా చూసే వీలు కల్పిస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫారమ్స్. అంతేకాదు అటు నిర్మాతలు కూడా థియేటర్లలో తమ సినిమాను విడుదలకు ముందే ఓటీటీలకు సినిమా హక్కులను ఇచ్చేసి అటు భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక ఇప్పుడు థియేటర్లలో సందడి చేయడానికి ఓటీటీలోకి రాబోతున్న మరో చిత్రం కే ర్యాంప్.

కిరణ్ అబ్బవరం హీరోగా.. యుక్తి తరేజ హీరోయిన్ గా రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం కే ర్యాంప్. జైన్స్ నాని తొలి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అధికారిక ప్రకటన చేస్తూ ఒక పోస్టర్ పంచుకుంది. ప్రముఖ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ సినిమా హక్కులను ఫాన్సీ ధరకు దక్కించుకోగా.. నవంబర్ 15వ తేదీ నుండి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇటు ఓటీటీ లో యువతను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

కే ర్యాంప్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) ధనికుల కుటుంబంలో జన్మిస్తాడు. కానీ పుట్టుకతోనే తల్లి కోల్పోవడంతో తల్లి లేదనే కారణంతో గారాబంగా పెంచుతారు తండ్రి కృష్ణ (సాయికుమార్). చిన్నతనం నుంచి చదువు, సంధ్యా లేకుండా కాలాన్ని వెల్లదీస్తూ ఉంటాడు. ఎన్ని విధాలుగా చెప్పినా కొడుకులో మార్పు రాకపోవడంతో మేనేజ్మెంట్ సీట్ కొని మరీ కేరళ పంపిస్తాడు కృష్ణ. అక్కడ ఒక రాత్రి తాగి పడిపోయిన కుమార్ ఊపిరి అందక ఇబ్బంది పడుతుంటే.. ఆ సమయంలో ఊపిరి అందించి అతడికి ప్రాణం పోస్తుంది మెర్సీ జాయ్ (యుక్తి తరేజ). ఆమె కూడా కుమార్ చదివే కాలేజీలోనే చదువుతూ ఉంటుంది. అలా ఇద్దరు ప్రేమలో పడతారు. అయితే ఆమెకి పోస్ట్ ట్రోమాటిక్ సస్ట్రెస్ డిసార్డర్ అనే ఒక సైకలాజికల్ సమస్య ఉంటుంది. దీని లక్షణం ఎవరైనా ప్రామిస్ చేసి తప్పితే.. తాను చెప్పినట్టు చేయకపోతే వెంటనే చనిపోవడానికి కూడా సిద్ధమవుతూ ఉంటుంది.

అలాంటి మెర్సీ అసలు మాట మీద నిలబడని కుమార్ ప్రేమలో పడుతుంది. అప్పటినుంచి కుమార్ కి అసలైన కష్టాలు మొదలవుతాయి. మెర్సీ పిచ్చి భరించలేక ఆమెకు బ్రేకప్ చెప్పాలనుకుంటాడు.. ప్రతి చిన్న విషయానికి కుమార్ ను టార్చర్ చేస్తూ ఉంటుంది. మరి ఈ టార్చర్ నుంచి కుమార్ బయటపడ్డారా? మెర్సీ పిచ్చితో కథ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి మెర్సీ జబ్బు నయమైందా? ఇలా పలు విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.