Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న కాంట్ర‌వ‌ర్షియ‌ల్ మూవీ

మ‌ల‌యాళ భామ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన జానకి వి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ సినిమా విడుద‌ల‌కు ముందు ప‌లు వివాదాల వ‌ల్ల కొన్నాళ్ల‌ పాటూ వార్త‌ల్లోకెక్కిన విష‌యం తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Aug 2025 12:59 PM IST
ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న కాంట్ర‌వ‌ర్షియ‌ల్ మూవీ
X

మ‌ల‌యాళ భామ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన జానకి వి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ సినిమా విడుద‌ల‌కు ముందు ప‌లు వివాదాల వ‌ల్ల కొన్నాళ్ల‌ పాటూ వార్త‌ల్లోకెక్కిన విష‌యం తెలిసిందే. ప్ర‌వీణ్ నారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో కేంద్ర మంత్రి, న‌టుడు సురేష్ గోపి కీల‌క పాత్ర‌లో న‌టించారు. కేర‌ళ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

రిలీజ్ కు ముందు ఎన్నో అడ్డంకులు

రిలీజ్ కు ముందు ఎన్నో అవాంత‌రాల‌ను ఎదుర్కొన్న ఈ సినిమా వాట‌న్నింటినీ అధిగ‌మించి జులై 17న మ‌ల‌యాళంలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర్వాలేద‌నిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ సినిమా ఆగ‌స్ట్ 15 నుంచి ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి రానుంది.

సెన్సార్ బోర్డు అభ్యంత‌రం

మూవీ టైటిల్ లో సీతా దేవికి ఇంకో పేరైన జాన‌కి పెట్ట‌డం, సినిమాలో ఆ పాత్ర అత్యాచారానికి గుర‌వ‌డంపై సెన్సార్ బోర్డు ఈ సినిమా రిలీజ్ విష‌యంలో అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో కోర్టు వ‌ర‌కు వెళ్లి ఆఖ‌రికి సినిమా పేరుని జాన‌కి వి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ‌గా మార్చడంతో వివాదం ముగిసింది. ఈ వివాదం వ‌ల్లే జూన్ 27న రిలీజ్ కావాల్సిన సినిమా జూన్ 17న రిలీజైంది.

తెలుగు రిలీజైన వారం రోజుల్లోపే

అయితే ఈ సినిమా జులై 17న కేవ‌లం మ‌ల‌యాళంలో మాత్ర‌మే రిలీజైంది. అదే టైమ్ లో తెలుగులో కూడా డ‌బ్ చేసి రిలీజ్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ అనౌన్స్ చేసి ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేశారు కానీ తెలుగు వెర్ష‌న్ మాత్రం రిలీజ్ అవ‌లేదు. ఆగ‌స్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ త‌ర్వాత ఆరు రోజుల్లోనే మూవీ ఓటీటీలోకి రానుండ‌టం విశేషం. మ‌ల‌యాళ కోర్టు రూమ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో శృతి రామ‌చంద్ర‌న్, దివ్య పిల్లై, మాధ‌వ్ సురేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటూ తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా రిలీజ్ కానుంది. జిబ్రాన్, గిరీష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఓటీటీలో ఆడియ‌న్స్ ను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.