దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ GAME’ డిజిటల్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ తేదీ ఇదే!
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా డిఫరెంట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి నహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు.
By: Madhu Reddy | 31 Oct 2026 9:12 PM ISTమలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా డిఫరెంట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి నహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో థియేట్రికల్ రన్ ముగియకముందే, విడుదలైన నెల రోజులకే ఈ మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. నవంబర్ 6న జియో హాట్‌స్టార్‌లో ఐదు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా విశేషాలు మీకోసం..
కథేంటంటే.. జూదం.. చేతి మార్పు:
డ్యాన్ (దుల్కర్ సల్మాన్) ఒక రిచ్ కిడ్. తండ్రి కోరిక మేరకు బిజినెస్‌లోకి వెళ్లినా.. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటాడు. తల్లి దాచుకున్న రూ. 60 లక్షలను కూడా బెట్టింగ్‌లో పెట్టి నష్టపోతాడు. బెట్టింగ్ నిర్వాహకులతో గొడవపడి కారులో పారిపోతున్న సమయంలో జరిగిన ప్రమాధంలో కుడి చేతిని కోల్పోతాడు. డాక్టర్లు వేరొకరి చేయిని డ్యాన్‌కు అమర్చుతారు. ఇక ఈ క్రమంలోనే ఫిజియోథెరపిస్ట్ ఇషా (కయాదు లోహర్)తో ప్రేమలో పడతాడు. అయితే అంతా బాగానే ఉందనుకునేలోపు, డ్యాన్ కుడి చేయి అతని నియంత్రణలో లేకుండా పోతుంది!
విచిత్రమైన చేతి రహస్యం:
డ్యాన్ చెప్పకుండానే ఆ కుడి చేయి తనంతట తానుగా ఇష్టంలేని పనులన్నీ చేయడం మొదలుపెడుతుంది. ఓ రోజు పబ్‌లో బెట్టింగ్ డాన్ డేవిడ్ (మిస్కిన్)ను చంపడానికి ఆ చేయి ప్రయత్నిస్తుంది. అసలు ఆ కుడి చేయి ఎవరిది? అది ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? డేవిడ్‌ను ఎందుకు చంపాలనుకుంటుంది? క్రికెట్ విక్రమ్‌కు, డ్యాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ ఫాంటసీ థ్రిల్లర్ కథ. థియేటర్‌లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
నటీనటుల అద్భుత నటన:
డ్యాన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అదరగొట్టేశారు. గ్యాంబ్లర్‌గా, తన చేతిని తానే కంట్రోల్ చేసుకోలేక ఇబ్బందిపడే నిస్సహాయుడిగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా ఒక చేతితో ఆయన చేసే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక కయాదు లోహర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగా చేసింది. విక్కీ పాత్రలో ఆంటోనీ వర్గీస్, విలన్‌గా మిస్కిన్ తమ పరిధి మేరకు చక్కటి నటనతో సినిమాను నిలబెట్టారు.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు:
థియేటర్లలో ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయిన ‘ఐ యామ్ గేమ్’ సినిమా, డిజిటల్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం 'జియో హాట్‌స్టార్'లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. విశేషం ఏంటంటే.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ అనే ఐదు ప్రధాన భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
ఒక విచిత్రమైన కాన్సెప్ట్‌తో, డిఫరెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం 'ఐ యామ్ గేమ్'. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారందరికీ ఇప్పుడు ఓటీటీ రూపంలో మంచి అవకాశం వచ్చింది. ఇక కుటుంబంతో కలిసి వీకెండ్‌లో చూడదగ్గ ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను నవంబర్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో అస్సలు మిస్ కాకండి.
