Begin typing your search above and press return to search.

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సుమారు రూ.20 కోట్ల మొత్తం ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం శాటిలైట్, ఓటీటీ హక్కులను సోనీ సంస్థ రూ.63 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చిన్న బడ్జెట్‌తో భారీ విజయాన్ని అందుకుని నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

By:  Sivaji Kontham   |   13 Nov 2026 9:00 PM IST
షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?
X

చిన్న బ‌డ్జెట్ల‌తో రూపొంది వంద‌ల కోట్లు వ‌సూళ్ల మ్యాజిక్ చేస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇదే కేట‌గిరీలో ఇటీవ‌లే విడుద‌లైన మ‌హిమాన్విత స్వామీజీ నీమ్ క‌రోలి బాబా బ‌యోపిక్ కేవ‌లం 2 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కి..(ప్రింట్ లు, ప‌బ్లిసిటీ ఇత‌ర ఖ‌ర్చుల‌తో క‌లిపి 20కోట్లు అయింది) ప్ర‌పంచ‌వ్యాప్తంగా 450 కోట్లు వ‌సూలు చేసింది. నిర్మాత‌కు 187 కోట్ల నిక‌ర లాభాలొచ్చాయి.. ఓవ‌ర్ నైట్ కింగ్ అయ్యాడు.

ఇప్పుడు శాటిలైట్- ఓటీటీ హ‌క్కుల‌ ధ‌ర షాకిస్తోంది. ప్ర‌ముఖ చానెల్ సోని ఈ రెండు ర‌కాల హ‌క్కుల కోసం దాదాపు 63 కోట్లు చెల్లించింద‌ని తెలిసింది. థియేట్రిక‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డ‌మే కాకుండా నాన్ థియేట్రిల్ రైట్స్ ప‌రంగాను బిగ్ డీల్స్ తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది ఈ చిన్న సినిమా. ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ ఇప్పుడు నిర్మాత ఫేట్ మార్చేసింది. ఈ నిర్మాత ఇక‌పై అలాంటి మ‌రో 10 సినిమాలు సులువుగా తీయ‌గ‌ల‌డు.. మంచి కంటెంట్ ఎంపిక 1000 కోట్ల సంపాద‌కుడిని చేస్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు! గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఏదైనా జ‌ర‌గొచ్చు అంటూ నెటిజ‌నులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఒక మంచి సినిమాని ప్రేక్ష‌కుల‌కు అందించాలంటే అస‌లు డైరెక్ట‌ర్ ఎలాంటి కంటెంట్ ఎంచుకోవాలో కూడా ఈ సినిమా స్ప‌ష్ఠంగా నిరూపించింది. హ‌నుమాన్ అంశ్.. కేవ‌లం ఒక డివోష‌న‌ల్ సినిమా అని భావించారు. కానీ దాని విజ‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

కంటెంట్‌లో బలం ఉంటే భారీ స్టార్ క్యాస్ట్.. వందల కోట్ల బడ్జెట్ అవసరం లేదని `హనుమాన్ అంశ్` మేక‌ర్స్ సినీ లోకానికి ఒక గొప్ప పాఠం నేర్పించారు. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని.. బలమైన కథాంశాలను ఆదరిస్తారని ఈ చిత్రం మరోసారి స్పష్టం చేసింది. సరైన కంటెంట్‌ను ఎంచుకునే నైపుణ్యం ఉంటే.. ఒక సాధారణ ఫిల్మ్ మేకర్ కూడా వంద‌ల‌ కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించగలడని నేటి ట్రెండ్ లో నిరూపిత‌మ‌వుతోంది.

వికాస్ బల్వంత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన `హనుమాన్ అంశ్`ను మాయా మూవీస్ బ్యానర్‌పై అరుణ్ మిశ్రా -ముఖేష్ శర్మ నిర్మించారు. బాబీ బేడీ నేతృత్వంలోని కాలిడోస్కోప్ ఎంటర్‌టైన్‌మెంట్ అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.