రేర్ ఫీట్... 115 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ నవంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విడుదలైన 115 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
By: Ramesh Palla | 26 Nov 2026 2:35 PM IST2026 లో వచ్చిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ముందు వరుసలో నిలిచే సినిమా 'హనుమాన్ అంశ్'. పైగా ఈ సినిమా కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొంది ఏకంగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీలో విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఇతర భాషల్లో డబ్ అయ్యి మరీ భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో సైతం విడుదల చేయడం జరిగింది. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా చాలా సింపుల్‌గా, నేచురల్‌గా సాగుతుంది. భారీ హంగామా లేకుండా, హడావిడి సీన్స్ లేకుండా సినిమా సింపుల్‌గా ఉండటంతో ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయింది, ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న నీమ్ కరోలీ బాబా జీవితం గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు.
ఓటీటీలో హనుమాన్ అంశ్...
ఈ మధ్య కాలంలో సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల్లో ఓటీటీలో వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మరీ దారుణంగా మూడు వారాల్లోనే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక సినిమా 50 రోజుల పాటు ఓటీటీలో రాలేదు అంటే కచ్చితంగా అది పెద్ద రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. అంతే కాకుండా వంద రోజుల వరకు కూడా సినిమా ఓటీటీలో రాలేదు అంటే అది పెద్ద రికార్డ్ అనుకోవచ్చు. కానీ హనుమాన్ అంశ్ ఏకంగా 115 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చింది. 115 రోజులుగా ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ నేపథ్యంలో చాలా మంది థియేటర్‌కు వెళ్లి చూశారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమాను ఓటీటీలో చూడ్డం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. వారి ఎదురుచూపులకు తెర పడే సమయం వచ్చింది.
నీమ్ కరోలీ బాబా జీవిత కథ...
హనుమాన్ అంశ్ సినిమాను నవంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా చూడవచ్చు. హిందీ భాషలో చూడాలి అంటే మాత్రం అదే రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలి. తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, గుజరాతీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. నీమ్ కరోలీ బాబా జీవితాన్ని గురించి తెలుసుకోవాలి, ఆయన మహిమల గురించి తెలుసుకోవాలి అనుకునే వారు చాలా కాలంగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. విదేశీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అవకాశాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను అత్యధిక దేశాల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగానూ చిత్ర యూనిట్ సభ్యులు, ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
టాలీవుడ్‌లో హనుమాన్ అంశ్..
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా డాక్టర్ విశాల్ చతుర్వేది ఈ సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడిగా విశాల్ చతుర్వేది ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. 2026, ఆగస్టు 7న హిందీ వర్షన్ విడుదల అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మెల్ల మెల్లగా సినిమా చాప కింద నీరులా దేశం మొత్తం పాకుతూ వెళ్లింది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు డబ్బింగ్ రైట్స్ తీసుకుని విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల చేతులు మారింది. తెలుగులో ఈ సినిమాను హోంబలే ఫిలింస్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు సైతం ఓటీటీలో చూడ్డం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ అయిన తర్వాత కచ్చితంగా చాలా రికార్డ్‌లు బ్రేక్ అయ్యే విధంగా అత్యధిక వ్యూవర్‌షిప్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన తర్వాత మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారే అవకాశాలు ఉన్నాయి.
