Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఎలిమినేట్ ట్విస్ట్ లీక్.. ఎవరు బయటకు వెళ్తున్నారంటే..?

బిగ్ బాస్ సీజన్ 9లో ఎనిమిదో వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   2 Nov 2025 9:42 AM IST
బిగ్ బాస్ 9.. ఎలిమినేట్ ట్విస్ట్ లీక్.. ఎవరు బయటకు వెళ్తున్నారంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో ఎనిమిదో వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తుంది. సండే ఈవెనింగ్ లో ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరన్నది తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ లీక్స్ ద్వారా ఈరోజు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది తెలిసిపోయింది. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఈరోజు డేంజర్ జోన్ లో గౌరవ్, మాధురి ఇద్దరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మిగతా ఆరుగురిని ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ వచ్చి ఫైనల్ గా ఈ ఇద్దరిని మాత్రమే డేంజర్ జోన్ లో ఉంచుతారు. అంటే ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ మరొకరు సేఫ్ అవుతారన్నమాట.

డేంజర్ జోన్ లో గౌరవ్, దువ్వాడ మాధురి..

ఇక ఈ ఇద్దరిలో కూడా దువ్వాడ మాధురి ఎలిమినేట్ అవ్వగా గౌరవ్ సేఫ్ అయినట్టు తెలుస్తుంది. సీజన్ 9లో ఈ ఇద్దరు కూడా వైల్డ్ కార్డ్స్ గా వచ్చారు. సీజన్ 9 ఫైర్ స్టోర్మ్ లో భాగంగా హౌస్ లోకి వచ్చిన ఈ ఇద్దరిలో గౌరవ్ ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాడు. టాస్క్ లల్లో తన పర్ఫార్మెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఐతే గౌరవ్ ఈ వారం డేంజర్ జోన్ లో ఉండటానికి అతను సపోర్ట్ చేయని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వేరే వాళ్లకి ఓట్ చేయడమే రీజన్ అయ్యి ఉండొచ్చు. గౌరవ్ కి ఉన్న స్ట్రెంగ్త్ కి మరో మంచి ఎపిసోడ్ పడితే అతను సేఫ్ అవుతాడు.

ఇక దువ్వాడ మాధురి సోషల్ మీడియా కాంట్రవర్షియల్ అయిన ఈమెను సీజన్ లో హైలెట్ అవుతుందని తీసుకొచ్చారు. హౌస్ లో కూడా ఆమె ఎక్కడా కూడా తగ్గకుండా మాటల తూటాలు వదిలారు. హౌస్ మేట్స్ తో దువ్వాడ మాధురి మాట్లాడే మాటలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి. ఐతే ఆమె వచ్చిన వారంతో పాటు గత రెండు వారాలు నామినేషన్స్ లో లేదు కాబట్టి ఆమె సేఫ్ అవుతూ వచ్చారు. ఐతే లాస్ట్ వీక్ తనూజ చేత డైరెక్ట్ నామినేట్ అయ్యింది మాధురి.

తనూజ గోల్డెన్ పవర్ వాడలేదా..

ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్న మాధురి, గౌరవ్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని వాళ్లిద్దరిని యాక్టివిటీ ఏరియాకు పంపించిన నాగార్జున తనూజ దగ్గర ఉన్న గోల్డెన్ పవర్ తో ఎవరినైనా సేఫ్ చేస్తావా అని అడుగుతాడు. ఐతే ముందే మాధురి తనకు ఆ గోల్డెన్ పవర్ వాడొద్దని చెప్పడం వల్ల తనూజ అది వాడకపోవచ్చు. అందుకే మాధురి ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు.

మాధురి ఎలిమినేషన్ తో హౌస్ లో కొంతమంది రిలాక్స్ గా ఫీల్ అవుతారు. తనూజకి చాలా క్లోజ్ అయిన మాధురి బయటకు వచ్చాక ఆమెను గెలిపించేందుకు కృషి చేస్తారని చెప్పొచ్చు. సో సీజన్ 9 లో ఎనిమిదో వారం హౌస్ నుంచి దువ్వాడ మాధురి ఎలిమినేట్ కన్ఫర్మ్ కాగా సండే ఎపిసోడ్ లో అది రివీల్ అవుతుంది.