Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. డీమాన్ పవన్ కి రెడ్ ఫ్లాగ్.. రీతు ఇష్యూపై నాగ్ ఫైర్..!

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ పై హౌస్ లో జరిగిన విషయాల మీద ఫైర్ అవ్వడం తెలిసిందే.

By:  Ramesh Boddu   |   2 Nov 2025 8:58 AM IST
బిగ్ బాస్ 9.. డీమాన్ పవన్ కి రెడ్ ఫ్లాగ్.. రీతు ఇష్యూపై నాగ్ ఫైర్..!
X

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ పై హౌస్ లో జరిగిన విషయాల మీద ఫైర్ అవ్వడం తెలిసిందే. రియాలిటీ షో ప్రపంచమంతా చూస్తుంది. అలాంటి షోలో ఎలాంటి ఇబ్బందికరమైన విషయాలు జరగకుండా చూసుకోవాలి. ఐతే జరిగిన వారం డీమాన్ పవన్, రీతు చౌదరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్లిద్దరు ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు. ఐతే డీమాన్ పవన్ రీతు కెప్టెన్ రూం లో ఉన్న టైం లో పవన్ మాట్లాడుతుంటే ఆమె వెళ్లిపోతుందని ఒక్కసారి రీతుని ఆగు అని తోసేశాడు.

రీతుని అలా తోసేసినందుకు నాగ్ ఫైర్..

రీతు బెడ్ మీద అలా ఒరిగి మళ్లీ లేచి మాట్లాడింది.. కొంతసేపటి తర్వాత మళ్లీ రీతు డిస్కషన్ వద్దు అనుకుని వెళ్లడానికి ట్రై చేస్తే మళ్లీ అలానే పవన్ నెట్టాడు. ఆ విషయంపై హోస్ట్ నాగార్జున పవన్ మీద సీరియస్ అయ్యారు. కెప్టెన్ దివ్యాతో స్టోర్ రూమ్ నుంచి బెల్ట్ తెప్పించి లివింగ్ ఏరియాలో టేబుల్ మీద పెట్టింది ఈ ఇష్యూ గురించి మాట్లాడాడు నాగార్జున.

రీతుని అలా తోసేసినందుకు.. ఆమె మాట్లాడటం ఇష్టం లేకపోయినా బలవంతంగా మాట్లాడాలని అన్నందుకు డీమాన్ పవన్ కి రెడ్ ఫ్లాగ్ ఇస్తూ బిగ్ బాస్ ని డోర్స్ ఓపెన్ చేయమని అన్నాడు నాగార్జున. పవన్ ప్యాక్ యువర్స్ లగేజ్ అండ్ బ్యాగ్ అంటూ నాగార్జున అన్నాడు. రీతు కూడా నాగార్జునని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఈ విషయంపై నాగార్జున హౌస్ మేట్స్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాడు. హౌస్ అంతా కూడా పవన్ ఇంటెన్షనల్ గా అలా చేయలేదని చెప్పారు.

డీమాన్ పవన్ నీల్ డౌన్ చేసి..

ఫైనల్ గా డీమాన్ పవన్ నీల్ డౌన్ చేసి అటు ఆడియన్స్ కి.. ఇటు రీతుకి కూడా సారీ చెప్పి ఇక మీదట అలాంటిది జరగదని అన్నాడు. నాగార్జున డీమాన్ పవన్ ఒక్కడే కాదు ఎవరు కూడా అలా చేయొద్దు. ఇక మీదట వచ్చే సీజన్లు.. వచ్చే కంటెస్టెంట్స్ కూడా ఇలా చేయడానికి వీల్లేదని చెప్పేందుకే అని అన్నారు.

డీమాన్ పవన్ నీల్ డౌన్ చేసి రిక్వెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీతు అతను తోసినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడలేదు కదా ఎందుకు అతనికి అంత పెద్ద శిక్ష అని అంటున్నారు. ఐతే ఇక్కడ రీతు ఒక్కతే కాదు ఇకముందు కూడా ఎవరు ఇలా ప్రవర్తించకూడదు అనేలా బిగ్ బాస్ టీం ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చిందని అనిపిస్తుంది. ఐతే పవన్ ని నీల్ డౌన్ చేసి చెప్పమని నాగార్జున కానీ.. బిగ్ బాస్ టీం కానీ చెప్పలేదు. అతనే జరిగిన దానికి తన సైడ్ నుంచి మోకాళ్లతో ప్రేక్షకులకు, హౌస్ మేట్స్ కి, రీతు కి సారీ చెప్పాడు. ఐతే నాగార్జున పవన్ దీన్ని మరోలా తీసుకోకుండా ఇదొక లెసన్ గా నేర్చుకో అని అన్నారు.