ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన కపుల్ ఫ్రెండ్లీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?
మరి ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందామా..
By: Madhu Reddy | 11 March 2026 12:20 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మానస వారణాసి జంటగా నటించిన క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'. వాలంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి వచ్చి యువత మనసు గెలుచుకున్న ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. నెల ముందు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం లో కపుల్స్ మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, వాళ్ళ ప్రేమను చాలా సహజంగా ఇందులో చూపించారు. మరి ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందామా..
బాక్సాఫీస్ జర్నీ - ప్రభాస్ సపోర్ట్‌తో పికప్:
ఈ సినిమా గతేడాది ఫిబ్రవరి 14న ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైంది. మొదట్లో వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నా, చిత్ర బృందం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మన 'రెబల్ స్టార్' ప్రభాస్‌తో మూవీ టీమ్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయించింది. ఇంకేముంది, ఆ ఇంటర్వ్యూ తర్వాత సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యి, కలెక్షన్లు మెల్లగా పుంజుకున్నాయి. అలా డీసెంట్ నంబర్లతో థియేట్రికల్ రన్‌ను ముగించుకున్న ఈ చిత్రం, ఇప్పుడు నెల తిరగకముందే ఓటీటీ ప్రియులను పలకరించేందుకు వచ్చేస్తోంది.
స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పటి నుంచి?:
ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను చూడాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్. మార్చి 13 (శుక్రవారం) నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా అందుబాటులో ఉండటం విశేషం. వీకెండ్‌లో ప్రశాంతంగా కూర్చుని ఒక మంచి లవ్ స్టోరీ చూడాలనుకునే వారికి 'కపుల్ ఫ్రెండ్లీ' బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
కథా నేపథ్యం - పెళ్లికి ముందే సహజీవనం:
సినిమా కథ విషయానికొస్తే.. నెల్లూరు కుర్రాడు శివ (సంతోష్ శోభన్) ఉద్యోగం కోసం చెన్నై వెళ్తాడు. అక్కడ జాబ్ దొరక్కపోవడంతో పార్ట్ టైమ్ బైక్ రైడర్‌గా పని చేస్తుంటాడు. ఇక ఈ క్రమంలోనే మిత్ర (మానస వారణాసి) పరిచయమవుతుంది. ఆమెది కూడా శివ లాంటి కథే, ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పి సిటీలో బతికేస్తుంటుంది. ఇక అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సి వస్తుంది. మరి పెళ్లి కాకుండానే కలిసి ఉన్న ఈ జంట జీవితం ఏ మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ సుఖాంతమైందా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా, సరదాగా సాగుతుంది. ఇక సంతోష్ శోభన్ తన సహజమైన నటనతో ఎప్పుడూ ఆకట్టుకుంటారు, ఈ సినిమాలో కూడా ఆయన నటన హైలైట్‌గా నిలిచింది. ఓటీటీలో ఇలాంటి యూత్ ఫుల్ సినిమాలు బాగా క్లిక్ అవుతుంటాయి, కాబట్టి ప్రైమ్ వీడియోలో ఈ సినిమా మంచి వ్యూస్ సాధించే అవకాశం ఉంది అంటున్నారు ఫాన్స్.
