డీమాన్ పవన్, రీతూకి బిగ్ బాస్ కండీషన్స్..?
బిగ్ బాస్ హౌస్ లో డీమాన్ పవన్, రీతూ చౌదరిల ఫ్రెండ్ షిప్ తెలిసిందే. ఇద్దరు చాలా క్లోజ్ అవ్వగా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి.
By: Ramesh Boddu | 5 Nov 2025 12:09 PM ISTబిగ్ బాస్ హౌస్ లో డీమాన్ పవన్, రీతూ చౌదరిల ఫ్రెండ్ షిప్ తెలిసిందే. ఇద్దరు చాలా క్లోజ్ అవ్వగా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఐతే లాస్ట్ వీక్ ఇద్దరి మధ్య వాదనల్లో భాగంగా రీతూని పవన్ మాట్లాడుతుంటే వెళ్తుందని ఆగమన్నట్టుగా నెట్టాడు.. ఆమె పక్కన బెడ్ మీద పడింది.. మళ్లీ అదే డిస్కషన్ కొనసాగించి మళ్లీ పవన్ ఆమెను నెట్టాడు. ఇలా రెండు సార్లు జరగడం వల్ల ఒక షోలో ఇలా జరగడం ఏమాత్రం కరెక్ట్ కాదని హోస్ట్ నాగార్జున డీమాన్ పవన్ కి రెడ్ ఫ్లాగ్ ఇచ్చి హౌస్ నుంచి బయటకు పంపించాలని చూశారు.
రీతు ఇష్యూ వల్ల పవన్ కి పనిష్మెంట్..
ఐతే హౌస్ మెట్స్ ఇంకా రీతు రిక్వెస్ట్ తో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఐతే ఆ తర్వాత డీమాన్ పవన్ నీల్ డౌన్ చేసి ఇక మీదట అలా బిహేవ్ చేయనని అన్నాడు. రీతుకి, హౌస్ మెట్స్ కి సారీ చెప్పాడు. ఐతే డీమాన్ పవన్, రీతు ఇష్యూ వల్ల పవన్ ఎలాంటి పనిష్మెంట్ ఫేస్ చేయాలన్నది కెప్టెన్ దివ్య చెబుతుందని నాగార్జున అన్నాడు. ఐతే ఆ పనిష్మెంట్ పవన్, రీతు దూరంగా ఉండాలని చెప్పారు.
బిగ్ బాస్ పనిష్మెంట్ లో భాగంగా ఇద్దరు కేవలం టాస్క్ లల్లో తప్ప మిగతా టైం లో కలిసి మాట్లాడొద్దని చెప్పాడు. అలా చెప్పడం వల్ల వారి మధ్య దూరం పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకే నిన్న డీమాన్ పవన్, రీతుకి అన్నం తినిపిస్తుంటే దివ్య వద్దని చెప్పింది. ఐతే ఇద్దరం మాట్లాడట్లేదు జస్ట్ తింటున్నాం అంటూ చెప్పింది రీతు. బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తే మాట్లాడట్లేదు.. జస్ట్ తింటున్నాం అని ఎలా అంటావ్ అంటూ దివ్య చెప్పింది.
రీతు మాత్రం పవన్ కు దగ్గరగా ఉండాలనే..
సో పవన్, రీతు వాళ్లు పెట్టుకున్న గొడవల వల్ల ఇద్దరిని దూరంగా ఉంచడం బెటర్ అని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు. మరి ఈ పనిష్మెంట్ సీజన్ పూర్తయ్యే వరకు ఉంటుందా లేదా కేవలం కొన్నాళ్లు మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది. రీతు మాత్రం పవన్ కు దగ్గరగా ఉండాలనే ఇప్పటికీ ట్రై చేస్తుంది. ఐతే పవన్ మాత్రం రీతు మీద కాకుండా ఇక మీదట ఆట మీద ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. ఆల్రెడీ నామినేషన్స్ టైం లో జరిగిన బొమ్మల టాస్క్ లో డీమాన్ ఫస్ట్ రీతు బొమ్మ తీసుకుని వెళ్లి సేఫ్ అయ్యాడు.
ఆడియన్స్ కూడా రీతుతో కాకుండా డీమాన్ పవన్ పూర్తిగా టాస్క్ ల మీద కాన్సెంట్రేట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది అన్నది వాళ్లకైనా అర్ధమవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
