Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారం నామినేషన్స్ మండే ఎపిసోడ్ లో మొదలయ్యాయి. ఈసారి వైల్డ్ కార్డ్స్ కి ఆ ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్.

By:  Ramesh Boddu   |   14 Oct 2025 12:49 PM IST
బిగ్ బాస్ 9.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరు..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో వారం నామినేషన్స్ మండే ఎపిసోడ్ లో మొదలయ్యాయి. ఈసారి వైల్డ్ కార్డ్స్ కి ఆ ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. అంటే వైల్డ్ కార్డ్స్ కి ఒక టాస్క్ ఇచ్చి అందులో ఎవరైతే బాల్ సంపాదిస్తారో వాళ్లు ఒక ఓల్డ్ కంటెస్టెంట్ కి బాల్ ఇచ్చి అతను ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ ఇద్దరిలో ఒకరిని ఎవరైతే బాల్ ఇస్తారో ఆ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఫైనల్ చేయాలి. ఈ టాస్క్ లో ముందుగా నిఖిల్ నాయర్ బాల్ ని సంపాదించి బజర్ మోగేదాకా తన దగ్గరే ఉండేలా మిగతా వైల్డ్ కార్డ్స్ తో పోటీ పడి గెలిచాడు.

సుమన్ ని నామినేట్ చేసిన తనూజ..

నిఖిల్ నాయర్ ఆ బాల్ ని తనూజాకి ఇచ్చాడు. తనూజ ఇద్దరిని నామినేషన్ కోసం ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉండగా అందులో ఒకరిని రాము, రెండో వ్యక్తిగా సుమన్ శెట్టిని ఎంపిక చేసింది. సుమన్ ఇంకా అందరితో కలవట్లేదని. టాస్కులు ఇన్వాల్వ్ మెంట్ ఉండట్లేదని చెప్పింది. అటు రాము విషయంలో తనకు పవర్ వచ్చినా కూడా వేరే వాళ్ల మాట విని వాళ్లు చెప్పిందే చేస్తున్నాడని రీజన్స్ చెప్పింది. ఐతే నిఖిల్ నాయర్ సుమన్ శెట్టి నామినేషన్ ని ఓకే చేశాడు.

నెక్స్ట్ మరోసారి బాల్ టాస్క్ ఇవ్వగా అందులో రమ్య మోక్ష గెలిచింది. ఆమె రాముకి బాల్ ఇవ్వగా రాము రీతు చౌదరి, డీమాన్ పవన్ ని నామినేషన్స్ లోకి తీసుకు రావాలని అనుకున్నాడు. లాస్ట్ వీక్ జరిగిన బెలూన్ టాస్క్ లో రీతు చౌదరి ఫౌల్ గేం ఆడిందని అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నా అన్నాడు. ఐతే సంచాలక్ గా నువ్వు ఏం చేస్తున్నావ్ అంటూ అతని మీద ఎదురుదాడికి దిగింది. డీమాన్ పవన్ కి కూడా ఆ బెలూన్ టాస్క్ లో తప్పు ఉందని అన్నాడు. ఐతే రమ్య మాత్రం రీతుని సేఫ్ చేసి డీమాన్ పవన్ ని నామినేట్ చేసింది.

డీమాన్ పవన్ ని నామినేట్ చేసిన రమ్య..

అతనికి అసలు బుర్ర లేదని ప్రతి విషయంలో బుర్ర లేకుండా చేస్తున్నాడని రీజన్ చెప్పి డీమాన్ పవన్ ని నామినేట్ చేసింది రమ్య. ఐతే మండే ఎపిసోడ్ లో నామినేషన్స్ టాస్క్ పూర్తి కాలేదు. కేవలం సుమన్ శెట్టి, డీమాన్ పవన్ ల ఎంపిక జరిగింది. మిగతా నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు ఎపిసోడ్ లో ఉంటుంది. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం భరణి, దివ్య, తనూజ, రాము కూడా నామినేషన్స్ లోకి వస్తారని టాక్. ఐతే ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారన్నది మాత్రం ఎపిసోడ్ తర్వాత తెలుస్తుంది.