Begin typing your search above and press return to search.

బిగ్ బాస్.. టైమింగ్స్ విషయంలో క్లారిటీ ఇస్తారా..?

మరో ఐదురోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కాబోతుంది. ఈ సీజన్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు టీం.

By:  Ramesh Boddu   |   2 Sept 2025 11:21 AM IST
బిగ్ బాస్.. టైమింగ్స్ విషయంలో క్లారిటీ ఇస్తారా..?
X

మరో ఐదురోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కాబోతుంది. ఈ సీజన్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు టీం. బిగ్ బాస్ సీజన్ 8 వరకు ఒక లెక్క కాగా సీజన్ 9 షో మొదలు పెట్టడానికి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒకటి నడిపిస్తున్నారు. బిగ్ బాస్ లవర్స్ అంతా కూడా దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వడానికి ముందే సీజన్ 9 కి కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తుంది. ఐతే బిగ్ బాస్ ప్రతి సీజన్ మొదలయ్యే ముందు కంటెస్టెంట్స్ లిస్ట్ తో పాటు షో టైమింగ్స్ గురించి కూడా చర్చ జరుగుతుంది.

10:00 to 11:00..

బిగ్ బాస్ షో టైమింగ్స్ ఇదివరకు 9:30 టూ 10:30 ఉండేది. కానీ మధ్యలో కొన్ని సీజన్లు నైట్ 10 టూ 11 పెట్టారు. ఆ టైం లో షో చూసే వాళ్ల సంఖ్య తగ్గింది. మళ్లీ సర్ధుకున్న బిగ్ బాస్ టీం మళ్లీ షోని స్టార్ మా లో నైట్ 9:30 నుంచి 10:30 వరకు నడిపించారు. బిగ్ బాస్ సీజన్ 9ని కూడా దాదాపు ఇదే టైమింగ్స్ ఉండే ఛాన్స్ ఉందట. ఐతే షోని మరీ నైన్ థర్టీకి కాకుండా నైన్ కే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఉందట.

మండే టూ ఫ్రై డే బిగ్ బాస్ నైన్ థర్టీ నుంచి టెన్ థర్టేఎ వరకు వస్తుంది. ఓనీల్ సాటర్ డే అండ్ సండే మాత్రమే 9 కి స్టార్ట్ అయ్యి 10:30 కి పూర్తి అవుతుంది. వారం మొత్తం హౌస్ లో జరిగిన విషయాలు కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు ఇవన్నీ కూడా వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున విశ్లేషిస్తారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుని ఈసారి నైట్ 9 నుంచి 10:30 వరకు కొనసాగించే ప్లాన్ ఉందట.

హౌస్ లో జరిగే 24 గంటల విషయాన్ని..

హౌస్ లో జరిగే 24 గంటల సరే నైట్ స్లీపింగ్ టైం ఒక ఆరేడు గంటలు తీసేస్తే హౌస్ లో జరిగే 17 గంటల విషయాన్ని గంటలో చూపించడం చాలా కష్టం. అందుకే ఈసారి ఎపిసోడ్ గంటన్నర చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ ఆడియన్స్ ఆసక్తిగానే ఉన్నారు. సీజన్ మొదలయ్యే టైం కి మరింత క్రేజీగా ఉంటారని చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈసారి సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ షో ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సీజన్ ముందు సీజన్ల కన్నా బెటర్ గా మంచి టి.ఆర్.పి తెచ్చుకునేలా ఉంటుందని అంటున్నారు. నాగార్జున కూడా ఈసారి హోస్టింగ్ స్టైల్ మార్చి అదరగొట్టాలని చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు.