Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: ఏడో వారంలో దక్షి, షాలిని ఎలిమినేషన్.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఏడో వారం ఎపిసోడ్స్ ఉత్కంఠభరితమైన మలుపులతో ముగిశాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   25 Oct 2026 8:43 PM IST
Bigg Boss Telugu 10: ఏడో వారంలో దక్షి, షాలిని ఎలిమినేషన్.
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఏడో వారం ఎపిసోడ్స్ ఉత్కంఠభరితమైన మలుపులతో ముగిశాయి. ఈ వారం ఊహించినట్లుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దక్షి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి తన ప్రయాణాన్ని ముగించింది. అయితే దక్షి ఎలిమినేషన్‌తో పాటు హౌస్‌లో మరో సంచలన ఎలిమినేషన్ కూడా జరిగింది. అదే షాలిని ఎలిమినేషన్.

తాజా వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆట తీరు, ప్రవర్తనపై తీవ్రంగా స్పందించారు. గేమ్‌లో అద్భుతంగా రాణించిన నరేష్, దెబ్జానీ మరియు అమన్‌లను నాగార్జున ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. మరోవైపు వర్షిణి, ముఖేష్, త్రిగుణ్, షాలిని మరియు రోహిత్‌లు తమ ఆట తీరును మెరుగు పరుచుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ వారం రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, శ్వేత నాయుడు, వర్షిణి, టెంపర్ వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, నీతులతో పాటు దక్షి కూడా నామినేషన్లలో ఉన్నారు. ఓటింగ్‌లో వెనుకబడిన దక్షి హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. సడన్ ఎలిమినేషన్ లో భాగంగా షాలిని కూడా ఎలిమినేట్ అయ్యారు.

ఆరో వారంలోనే ఎలిమినేట్ కావాల్సింది పోయి, సీక్రెట్ రూమ్ ద్వారా మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చిన షాలిని ఆట తీరుపై ఇప్పుడు మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆమె ప్రవర్తన, తోటి కంటెస్టెంట్లతో గొడవలు ప్రేక్షకుల్లోనూ, మేకర్స్‌లోనూ తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి.

దక్షి ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ ఒక సర్ప్రైజ్ ట్విస్ట్ ప్లాన్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే వరం థీమ్ కూడా ఆసక్తిగా ఉండబోతుందని సమాచారం వస్తుంది. ఇకపోతే షాలిని ఎలిమినేషన్ తర్వాత కచ్చితంగా రోహిత్ తన గేమ్ ని మార్చుకొనే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హోస్ట్ నాగార్జున ఇచ్చిన హింట్స్ ని కరెక్టుగా వాడుకుంటే, రోహిత్ కి ఈ గేమ్ లో తిరుగుండదు.