బిగ్ బాస్ 9.. బొమ్మల ఆటతో నామినేషన్ గేమ్.. లిస్ట్ లో ఎవరెవరంటే..?
సంజన నేను కేవలం సోలో గేమ్ ఆడుతున్నా.. రీతుకి సపోర్ట్ ఉందని చెప్పింది. రీతు మాత్రం మీకు కూడా ఇమ్మాన్యుయెల్ సపోర్ట్ ఉంది.
By: Ramesh Boddu | 4 Nov 2025 9:50 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో మళ్లీ బొమ్మల ఆట.. అదే ప్రతి సీజన్ లో చిన్న టెడ్డీ ని పెట్టి ఆ బొమ్మల మీద కంటెస్టెంట్స్ ఫోటో ఉంచి రౌండ్ రౌండ్ కి వెనకపడి వారు దగ్గర ఉన్న ఉన్న టెడ్డీ మీద ఉన్న ఫోటోతో పాటు వెనకపడ్డ వారు కూడా నామినేషన్స్ లో ఉంటారు. ఈ నామినేషన్ ప్రక్రియలో మొదటి రౌడ్ లో సంజన అందరి కన్నా చివరన మిగిలింది. ఐతే ఆమె దగ్గర ఉన్న టెడ్డీ పై తన బొమ్మే ఉండటం వల్ల కెప్టెన్ దివ్యాకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరినైనా సంజనతో నామినేషన్స్ కు పోటీ ఇచ్చేలా చేయమని చెప్పారు. దాని వల్ల దివ్య రీతు పేరు చెప్పింది. సంజన, రీతు ఇద్దరు తమ పాయింట్స్ పెట్టారు.
సంజనని కెప్టెన్ దివ్య నామినేట్..
సంజన నేను కేవలం సోలో గేమ్ ఆడుతున్నా.. రీతుకి సపోర్ట్ ఉందని చెప్పింది. రీతు మాత్రం మీకు కూడా ఇమ్మాన్యుయెల్ సపోర్ట్ ఉంది. ఆయనతో కలిసి ఆడుతున్నారని అన్నారు. మధ్యలో సంజన మీద వల్ల ఒకరు నీల్ డౌన్ అయ్యాడని డీమాన్ పవన్ పాయింట్ పెట్టింది. ఐతే కెప్టెన్ దివ్య అది వద్దని చెప్పడంతో ఫైనల్ గా సంజనని కెప్టెన్ దివ్య నామినేట్ చేసింది. ఆ నామినేషన్ అనంతరం కిచెన్ దగ్గరకు వెళ్లి తన కోసం హెయిర్ కట్ చేసిన రీతు ని నామినేట్ చేశా.. ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని ఏడ్చేసింది. హౌస్ మేట్స్ అంతా వచ్చి ఆమెను కన్ సోల్ చేశారు.
ఇక రెండో రౌండ్ లో బిగ్ బాస్ రూల్ మార్చి ఎవరైతే వెనుకబడిన వారు.. ఆ టెడ్డీ మీద ఉన్న ఫోటో ఉంటుందో వారు కంటెస్టెంట్స్ నుంచి ఎవరో ఒకరిని నామినేట్ చేయాలని అంటాడు. అలా రెండో రౌండ్ లో సాయి చివరగా వస్తాడు. అతను తనూజని నామినేట్ చేస్తాడు.. భరణి తనూజ ఇద్దరు నామినేషన్స్ పాయింట్స్ చెబుతారు. తనూజ భరణి మధ్య కూడా వాదన జరుగుతుంది. ఫైనల్ గా దివ్య భరణిని నామినేట్ చేస్తుంది.
తనూజ బొమ్మ ఉన్న డాల్ తో సుమన్ శెట్టి..
ఆ తర్వాత సుమన్ శెట్టి చివర్లో వస్తాడు. అతను తనూజ బొమ్మ ఉన్న డాల్ పట్టుకుంటాడు. ఐతే అతను తన ఫిజిక్ వల్ల వెనకపడ్డానని తనూజని నామినేట్ చేయాలని లేదని చెప్పి.. తనను తాను నామినేట్ చేసుకుంటా అంటాడు. కానీ బిగ్ బాస్ దానికి ఒప్పుకోడు.. ఫైనల్ గా తనూజ, సుమన్ శేట్టిలలో మళ్లీ సుమన్ శెట్టినే నామినేట్ చేస్తారు.
తనూజకి నామినేషన్ ఛాన్స్ రావడంతో తనూజ ఇమ్మాన్యుయెల్ ని నామినేట్ చేస్తుంది. రీతు రాముని నామినేట్ చేస్తుంది. నామినేషన్స్ వస్తే చాలు తనూజ, ఇమ్మాన్యుయెల్ ఫైట్ తెలిసిందే. ఈ నామినేషన్స్ లో కూడా తనూజ, ఇమ్మాన్యుయెల్ మధ్య గట్టి వాదన జరిగింది. ఇమ్మాన్యుయెల్ సేఫ్ ఆడుతున్నాడని తనూజ అనగా.. సపోర్ట్ లేకుండా తనూజ ఇక్కడిదాకా రాలేదని ఇమ్మాన్యుయెల్ అన్నాడు.
ఇమ్మాన్యుయెల్ ని సేఫ్ చేసి రాముని నామినేషన్స్ లో..
ఐతే ఆ రౌండ్ సంచాలక్ గా కళ్యాణ్ ఉండగా ఇమ్మాన్యుయెల్ ని సేఫ్ చేసి రాముని నామినేషన్స్ లో పెట్టాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుయెల్ సాయిని నామినేట్ చేయగా నిఖిల్ తనూజని నామినేట్ చేస్తాడు. డీమాన్ పవన్ సాయిని నామినేట్ చేసి తనూజని సేఫ్ చేస్తాడు. అలా ఫైనల్ గా సుమన్ శెట్టి, సంజన, సాయి, రాము, భరణి నామినేషన్స్ లోకి వస్తారు. దివ్య కెప్టెన్ అవ్వడం వల్ల ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయాలని అనగా.. ఆమె తనూజని నామినేట్ చేస్తుంది. మళ్లీ ఈ ఇద్దరు భరణి విషయంలో వాదన జరుపుతారు. ఫైనల్ గా దివ్య తనూజని నామినేట్ చేస్తుంది.
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మరీ అంత గొడవలు జరగలేదు కానీ ఎవరు ఎవరి మీద ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారన్నది అర్ధమవుతుంది. ఫైనల్ గా ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేందుకు నామినేషన్స్ లో సంజన, సుమన్, భరణి, రాము, సాయి, తనూజ ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి వీకెండ్ బిగ్ బాస్ హౌస్ కి గుడ్ బై చెబుతారన్నది చూడాలి.
