బిగ్ బాస్ 9.. వాళ్ల కన్నా వీళ్లకే క్రేజ్..!
బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. ఆదివారం గ్రాండ్ లాంచింగ్ జరిగింది. కింగ్ నాగార్జున ఎప్పటిలానే తన ఎనర్జీతో షో ప్రారంభించారు.
By: Ramesh Boddu | 8 Sept 2025 11:15 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. ఆదివారం గ్రాండ్ లాంచింగ్ జరిగింది. కింగ్ నాగార్జున ఎప్పటిలానే తన ఎనర్జీతో షో ప్రారంభించారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో ముందు నుంచి చెబుతున్నట్టుగా సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ గానే ఆట కొనసాగుతుంది. హౌస్ లోకి 15 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. వాళ్లలో 9 మంది సెలబ్రిటీస్ కాగా.. మిగతా ఆరుగురు కామన్ మ్యాన్. అదే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వెళ్లిన వాళ్లన్నమాట. కామన్ మ్యాన్ కి ఈ సీజన్ పెద్ద పట్టం కట్టినట్టు ఉన్నారు.
సెలబ్రిటీస్ ని టెనంట్స్ గా అవుట్ హౌస్ లో..
మొదటి రోజే వాళ్లని హౌస్ లో ఉంచి సెలబ్రిటీస్ ని టెనంట్స్ గా అవుట్ హౌజ్ లో ఉంచుతున్నారు. మరి వీళ్లు ఆ హౌస్ లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతారన్నది చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో వచ్చిన సెలబ్రిటీస్ కన్నా కామన్ మ్యాన్ కే ఎక్కువ క్రేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సెలబ్రిటీస్ లో తనూజ సీరియల్ యాక్ట్రెస్ కి ఒక మోస్తారు క్రేజ్ ఉంది. రాము రాథోడ్ సింగర్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక భరణి శంకర్ కి ఫాలోయింగ్ ఉన్నా అతని ఆటను బట్టి అది వస్తుంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ కూడా ఒక మోస్తారు క్రేజ్ ఉన్నా అది హౌస్ లో ఎన్నాళ్లు సర్వైవ్ అయ్యేలా చేస్తుందో చూడాలి.
ఇక ఫ్లోరా షైనీ, సంజన, సుమన్ శెట్టి లాంటి వాళ్లకు పెద్దగా క్రేజ్ లేదు. రీతూ చౌదరి యాంకర్ గా సోషల్ మీడియాలో హంగామా బాగానే ఉంటుంది. సో వీళ్ల కన్నా బిగ్ బాస్ 9 కోసం అగ్నిపరీక్ష దాటి వచ్చిన కామన్ మ్యాన్ కే ఎక్కువ క్రేజ్ ఉంది. ఎందుకంటే వాళ్లు ఆల్రెడీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఓటింగ్ కూడా పొందారు. బిగ్ బాస్ హౌస్ లో కావాల్సిందే ఆడియన్స్ ఓటింగ్ సంపాదించడం. సో అది హౌస్ లోకి రాకముందే పొందారు కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్.
కామన్ మ్యాన్ మీదే ఆడియన్స్ ఫోకస్..
అందుకే ఈ సీజన్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కన్నా కామన్ మ్యాన్ గా వచ్చిన ఆరుగురి మీదే ఆడియన్స్ ఫోకస్ ఉంటుంది. అంతేకాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా మరో ఇద్దరు లేదా ముగ్గురిని బిగ్ బాస్ అగ్నిపరీక్షలో మిగిలిన ఏడుగురిలో ఒకరిని పంపిస్తారని టాక్. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభం నుంచే అదిరిపోయే ప్లాన్స్ తో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి సీజన్ 9 ఇదే రేంజ్ లో కొనసాగితే మాత్రం అదిరిపోయే టి.ఆర్.పి సొంతం చేసుకుంటుందని చెప్పొచ్చు.
