Bigg Boss Telugu 10: హౌస్‌లోకి ఆ ఐదుగురు.. ఇక అసలు ఆట మొదలు..!
ఇప్పటికే స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకను స్పష్టం చేసింది.
By: Priya Chowdhary Nuthalapti | 10 Oct 2026 10:06 PM ISTబిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ప్రస్తుతం ఆట ఆసక్తికరంగా నడుస్తోంది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తవుతున్న సమయంలో హౌస్‌లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, వాదనలు, టాస్కులతో షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే షోపై మరింత ఆసక్తి పెంచేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇక రేపటి నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రచారం మొదలైనప్పటి నుంచి ఈ షో పై మరింత ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తోంది.
ఇప్పటికే స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకను స్పష్టం చేసింది. దీంతో కొత్తగా హౌస్‌లోకి ఎవరు వస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి బాగానే ఉంది. ఈసారి ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి రాకతో ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఆటతీరు మారే అవకాశం ఉంది. చాలామంది ఇప్పటికే ఒక స్ట్రాటజీ పెట్టుకొని ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్ వాళ్లు ఆల్రెడీ కొంత షో చూసి వస్తుంటారు కాబట్టి.. వాళ్ల స్ట్రాటజీ వల్ల పాత వాళ్ళు కూడా ప్రభావితమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
కొత్తవాళ్లు రావడంతో పోటీ మరింత పెరగడంతో పాటు హౌస్‌లో కొత్త గొడవలు కూడా మొదలయ్యే అవకాశం లేకపోలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల విషయంలో కొన్ని పేర్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. సీరియల్ నటుడు శివకుమార్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, కొరియోగ్రాఫర్ నీతూ నటరాజ్, అగ్ని పరీక్ష షోలో పాల్గొన్న రామకృష్ణ, నటి దక్షి గుట్టికొండ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరంతా హౌస్‌లోకి వస్తారా లేదా అనే విషయం ఇంకా కచ్చితంగా తెలియదు.
మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే ఊహాగానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఒకరిని ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా బయటకు పంపించగా, మరొకరిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల అభిప్రాయాల ఆధారంగా ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో షాలిని లేదా అపూర్వలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. అయితే మరో ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తోంది. డబుల్ ఎలిమినేషన్‌కు బదులుగా ఒకరిని మాత్రమే ఎలిమినేట్ చేసి మరొకరిని సీక్రెట్ రూమ్‌కు పంపించవచ్చని అంటున్నారు.
ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని పెంచుతున్నప్పటికీ, షోపై మరింత క్రేజ్ తీసుకురావడానికి కొత్తవాళ్ల రాక కీలకంగా మారనుంది. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. మొత్తానికి కొత్తవాళ్లు వస్తే ఈ షో పైన మరింత ఇంట్రెస్ట్ పెరగడం మాత్రం ఖాయమని చెప్పాలి.
