Begin typing your search above and press return to search.

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. ముఖేష్ గౌడ టాప్‌లో ఉండగా, వర్షిణి, నీతూ మాస్టర్, శివకుమార్, సుధీర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీపావళి సందర్భంగా ఈ వారం ఎలిమినేషన్ రద్దు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే డేంజర్ జోన్‌లో ఉన్నవారికి ఊరట లభించనుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   8 Nov 2026 10:13 AM IST
9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం అత్యంత రసవత్తరమైన దశకు చేరుకుంది. 8వ వారంలో రోహిత్ నాయుడు షాకింగ్ ఎలిమినేషన్, ఆ తర్వాత తలెత్తిన వివాదాలు రేపిన దుమారం అంతాఇంతా కాదు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, ఊహాగానాలు ఆసక్తికరంగా మారాయి.

ఈ 9వ వారంలో ఏకంగా 10 మంది కంటెస్టెంట్లు: రామ్ ప్రసాద్, నరేష్, అమన్, నీతూ మాస్టర్, వంశీ, ముఖేష్ గౌడ, వర్షిణి, దెబ్జానీ, శివకుమార్, సుధీర్ నామినేషన్ బరిలో నిలిచారు. వీరిలో రోహిత్ లేకపోవడం, త్రిగుణ్ నామినేషన్లలో లేకపోవడంతో ముఖేష్ గౌడ భారీ ఓట్లతో టాప్‌లో దూసుకుపోతుండగా.. త్రిగుణ్ సపోర్ట్, కెప్టెన్సీ కలిసి రావడంతో టెంపర్ వంశీ రెండో స్థానంలో నిలిచారు.

ఇక రామ్ ప్రసాద్, నరేష్, అమన్, దెబ్జానీలు సురక్షిత జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా నీతూ మాస్టర్, శివకుమార్, వర్షిణి మరియు సుధీర్‌లు అత్యంత లీస్ట్ పర్సంటేజ్‌తో డేంజర్ జోన్‌లో ఉన్నారు. గత వారం ముఖేష్ పవర్ ద్వారా తృటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న సుధీర్, ఈ వారం కూడా అతి తక్కువ ఓట్లు సాధించినప్పటికీ.. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఆయన సేఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ తొమ్మిదో వారంలో ఎలాంటి ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. రాబోయే పండగను పురస్కరించుకుని 'దీపావళి ధమాకా' ట్రీట్‌గా బిగ్‌బాస్ మేకర్స్ ఈ వారం ఎలిమినేషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. డేంజర్ జోన్‌లో ఉన్న వర్షిణి, నీతూ మాస్టర్‌లకు ఇది పెద్ద ఊరట అవుతుంది.

గ్రాండ్ ఫినాలేకు కౌంట్‌డౌన్ మొదలైన తరుణంలో.. హౌస్‌లో ఇంకా చాలా మంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. మధ్యలో ఇలా 'నో ఎలిమినేషన్' వీక్ కనుక వస్తే, రాబోయే రోజుల్లో హౌస్‌లోని మిగతా వారందరినీ షార్ట్‌లిస్ట్ చేయడానికి మేకర్స్ తప్పనిసరిగా మూడు సార్లు డబుల్ ఎలిమినేషన్‌లను అమలు చేయాల్సి వస్తుంది.