Bigg Boss Telugu 10: నీతూ నటరాజ్ అవుట్? డబుల్ ఎలిమినేషన్‌పై ఉత్కంఠ!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 11వ వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. 11 మంది నామినేషన్లలో ఉండగా, ఓటింగ్‌లో వెనుకబడిన నీతూ నటరాజ్ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే రామకృష్ణ లేదా సుధీర్‌లో ఒకరు కూడా బయటకు వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. వీకెండ్ ఎపిసోడ్‌లో దీనిపై స్పష్టత రానుంది.
By: Priya Chowdhary Nuthalapti | 22 Nov 2026 4:08 PM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పదకొండో వారం చివరి దశకు చేరుకోవడంతో ఎలిమినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వారం నామినేషన్లలో త్రిగుణ్, ముఖేష్, దెబ్జానీ, అమన్, రామకృష్ణ, వర్షిణి, రామ్‌ప్రసాద్, వంశీ, సుధీర్, శివ, నీతూ మాస్టర్.. మొత్తం 11 మంది కంటెస్టెంట్లు బరిలో నిలిచారు. తాజా సమాచారం ప్రకారం నీతూ నటరాజ్ మాస్టర్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఓటింగ్ పరంగా నీతూ నటరాజ్ బాటమ్‌లో నిలవడం ఆమెకు పెద్ద మైనస్‌గా మారింది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎంతో దూకుడుగా కనిపించినప్పటికీ.. రానురాను ఆటలో ఆ జోరు తగ్గిపోయింది. ఇటీవలి వారాల్లో కంటెంట్ ఇవ్వడంలో వెనుకబడటం, నామినేషన్లలో ఎమోషనల్‌గా స్పందించడం వంటివి ఆమె గ్రాఫ్‌ను తగ్గించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతుండగా, హౌస్‌లో ఇంకా చాలా మంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. దీంతో ఈ 11వ వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఒకవేళ ఇద్దరు ఎలిమినేట్ అయితే.. నీతూ నటరాజ్‌తో పాటు రామకృష్ణ లేదా సుధీర్లలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
సింగిల్ ఎలిమినేషన్‌తోనే సరిపెడితే మాత్రం, రాబోయే వారాల్లో వరుస డబుల్ ఎలిమినేషన్‌లు తప్పవని అంచనాలు ఉన్నాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఎవరికి ఎగ్జిట్ డోర్ చూపిస్తారు, డబుల్ ఎలిమినేషన్ నిజమేనా అనేది త్వరలోనే స్పష్టత రానుంది!
