Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: టాస్క్ ఓడిపోయినా సింపతీ మూటగట్టుకుంటున్న వంశీ!

బిగ్‌బాస్ హౌస్‌లో ఆరో వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరుగుతున్న టాస్క్‌లు తీవ్ర ఉద్రిక్తతలకు, వివాదాలకు దారి తీస్తుండగా, టెంపర్ వంశీ మాత్రం ఆటలో ఓడిపోయిన నిరాశతో తనను తాను కొనుక్కోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   16 Oct 2026 9:05 AM IST
Bigg Boss Telugu 10: టాస్క్ ఓడిపోయినా సింపతీ మూటగట్టుకుంటున్న వంశీ!
X

బిగ్‌బాస్ హౌస్‌లో ఆరో వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరుగుతున్న టాస్క్‌లు తీవ్ర ఉద్రిక్తతలకు, వివాదాలకు దారి తీస్తుండగా, టెంపర్ వంశీ మాత్రం ఆటలో ఓడిపోయిన నిరాశతో తనను తాను కొనుక్కోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ హౌస్ నిబంధనల ప్రకారం ఎవరిని వారు హింసించుకోవడం, భౌతికంగా గాయపరచుకోవడం నిషిద్ధం కాగా, గతంలోనూ ఇలా చేసిన కంటెస్టెంట్లకు హోస్ట్ నుంచి గట్టిగా తిట్లు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఆరో వారం కెప్టెన్సీ కంటెండర్ల రేసులో భాగంగా గ్రీన్, గోల్డ్ టీమ్‌ల మధ్య ఒక టాస్క్ జరిగింది. ఈ గేమ్‌లో వంశీ మరియు శివ తలపడగా త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. గార్డెన్ ఏరియాలో దాచి పెట్టిన బౌల్ అండ్ ప్లేట్‌ను తెచ్చి పెడెస్టల్‌పై ఉంచి బెల్ కొట్టాలనేది టాస్క్ రూల్ కాగా, వంశీ దాన్ని వెతికి పట్టుకున్నప్పటికీ పెడెస్టల్‌పై పెట్టకుండానే హడావిడిగా బెల్ కొట్టేశాడు.

టాస్క్ ఇంకా పూర్తి కాలేదని త్రిగుణ్ చెప్పినా, లోపల నుంచి వర్షిణి "పెడెస్టల్‌పై పెట్టు అన్నా" అంటూ అరిచినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. అయితే ఈ గ్యాప్‌లో అప్రమత్తమైన శివ వంశీ చేతిలో నుంచి ప్లేట్‌ను లాక్కుని పెడెస్టల్‌పై పెట్టాడు. ఆ తర్వాత వంశీ బౌల్ తెచ్చి పెట్టినా, శివ దాన్ని సరిగ్గా అమర్చడంతో ఆ గేమ్‌లో శివ విజయం సాధించినట్లు తేల్చారు. తాను గెలవాల్సిన గేమ్‌ను చిన్న పొరపాటు వల్ల పోగొట్టుకున్నాననే ఆవేదనతో వంశీ ఒక్కసారిగా కుమిలిపోయి, తనని తాను నియంత్రించుకోలేక తన చెంపలపై తీవ్రంగా కొట్టుకుంటూ సెల్ఫ్ హార్మింగ్‌కు పాల్పడ్డాడు.

తోటి కంటెస్టెంట్లు ఎంత వారించినా అతను వినకుండా ఆ బాధతో స్మోకింగ్ ఏరియాకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించగా, వంశీ పరిస్థితి చూసి చలించిపోయిన దెబ్జానీ అతన్ని ఓదార్చింది. చివరకు త్రిగుణ్ వెళ్లి వంశీని హగ్ చేసుకుని కంటతడి పెట్టడం ఎపిసోడ్‌లో అత్యంత భావోద్వేగ సన్నివేశంగా నిలిచింది.

ఆటలో ఓటమిని జీర్ణించుకోలేక వంశీ ఇలా తనను తాను హింసించుకోవడంపై వీకెండ్‌లో నాగార్జున ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి! అయితే ఈ దెబ్బతో వంశీకి సింపతీ వర్క్ అవుతుందని, త్రిగుణ్ ఫాన్స్ అందరూ అతనికే ఓట్స్ వేస్తారని అభిప్రాయాలు సోషల్ మీడియా లో వ్యక్తమవుతున్నాయి.