Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: హౌస్‌లో మొదలైన అసలైన గేమ్.. 12 మంది నామినేషన్లతో దబిడిదిబిడే!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ పరిస్థితులు మారిపోతున్నాయి. ఏడో వారంలో ఏకంగా 12 మంది నామినేషన్లలోకి రావడంతో హౌస్‌లో ఉత్కంఠ పెరిగింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   21 Oct 2026 3:23 PM IST
Bigg Boss Telugu 10: హౌస్‌లో మొదలైన అసలైన గేమ్.. 12 మంది నామినేషన్లతో దబిడిదిబిడే!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ పరిస్థితులు మారిపోతున్నాయి. ఏడో వారంలో ఏకంగా 12 మంది నామినేషన్లలోకి రావడంతో హౌస్‌లో ఉత్కంఠ పెరిగింది. సభ్యుల మధ్య గొడవలు, స్నేహాలు, ఆరోపణలు, కొత్త వ్యూహాలతో గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. షాలిని ఎలిమినేషన్ తర్వాత రోహిత్ ఆట ఎలా ఉండబోతోంది? వర్షిణి, నీతూ మధ్య గొడవ ఎలాంటి ప్రభావం చూపనుంది? త్రిగుణ్‌కు ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి? ఇప్పుడు ఇవే తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ షోలో.. షాలిని ఎలిమినేషన్ రోహిత్ గేమ్‌పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. షాలిని తనకు రీచార్జ్ పాయింట్ అని రోహిత్ చెప్పిన మాటలు నిజమే అని అనిపించేలా ప్రస్తుతం అతని పర్ఫామెన్స్ కొనసాగుతోంది . మరి ప్రస్తుతం రోహిత్ ఆమె లేకుండా తన ఆటను ఎలా కొనసాగిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇతర సభ్యులతో అతను ఎలా కలిసిపోతాడు, తన ఆటపై ఎంత దృష్టి పెడతాడనేది చూడాలి.

ఈ గొడవలు ఏందిరా బాబు..!

హౌస్‌లో వర్షిణి, నీతూ మధ్య జరిగిన వాగ్వాదం కూడా చర్చకు వచ్చింది. రూల్స్ పాటించడం, ఇతరుల ఆటతీరుపై వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలు వీరి మధ్య వివాదానికి కారణమయ్యాయి. రోహిత్, షాలిని మధ్య ఉన్న సంబంధంపై వచ్చిన ఆరోపణలు కూడా పరిస్థితిని మరింత వేడెక్కించాయి. ఈ గొడవలు కొంతమందికి నచ్చుతూ ఉంటే మరి కొంతమంది మాత్రం ఈ గొడవలు ఏందిరా బాబు అంటూ సోషల్ మీడియాలో ఎందుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు.

మరి ఇన్ని సవాళ్లు అవసరమా..!

శ్వేత నామినేషన్‌తో త్రిగుణ్‌కు కొత్త సవాలు ఎదురైంది. గేమ్‌లో నమ్మకద్రోహం, కెప్టెన్సీ కంటెండర్ ఎంపిక వంటి విషయాలపై ఆరోపణలు రావడంతో తన నిర్ణయాలను అతను సమర్థించుకోవాల్సి వచ్చింది. అయితే ఈ పరిణామాలు త్రిగుణ్‌కు నష్టం చేస్తాయా, తన ఆటను మరింత బలంగా మార్చుకుంటాడా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

మరోపక్క కెప్టెన్ రాంప్రసాద్‌కు లభించిన ప్రత్యేక అధికారంతో అమన్ నేరుగా నామినేట్ అయ్యాడు. ఈ నిర్ణయం అమన్‌కు పెద్ద సవాలుగా తయారయ్యింది. నామినేషన్లలోకి వచ్చిన తర్వాత అతనికి ప్రేక్షకుల మద్దతు ఎంత ఉందో తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడింది.

ఈ వారం నామినేషన్లలో ఉన్నది వీరే!

దక్షి, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ, రామకృష్ణ, శివ్, ఝాన్సీ, శ్వేత, వంశీ, అమన్ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు.

12 మంది నామినేషన్లలో ఉండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. గొడవలు, స్నేహాలు, భావోద్వేగాలు సభ్యుల ఆటను ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఇంటి సభ్యుల అభిప్రాయాలు, ప్రేక్షకుల ఓటింగ్ ఒకేలా ఉండకపోవచ్చు.

మరి ఈవారం ఇంట్లో ఎవరు ఉంటారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారు.. అనే విషయం ప్రస్తుతానికి మాత్రం ఎవరు అంచనా వెయ్యలేని స్థితిలోనే ఉన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో చివరి వరకు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!