Bigg Boss Telugu 10: షాలిని-రోహిత్ ల మీద ఎటాక్ కి దిగుతున్న నీతూ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి హౌస్‌లో వాతావరణం పూర్తిగా వేడెక్కింది.
By: Priya Chowdhary Nuthalapti | 14 Oct 2026 4:14 PM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి హౌస్‌లో వాతావరణం పూర్తిగా వేడెక్కింది. చిన్న చిన్న విషయాలకే కంటెస్టెంట్లు తీవ్ర వాగ్వాదాలకు దిగుతుండగా, తాజా ఎపిసోడ్‌తో హౌస్‌లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన నీతు నటరాజ్‌తో రోహిత్, షాలినిల గొడవలు షోలో హాట్ టాపిక్‌గా మారాయి.
వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నీతుపై రోహిత్, షాలిని జంట కొంత పక్షపాతం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉండగా, స్టేజ్ మీద నీతు మాట్లాడిన కొన్ని మాటలు తనను హర్ట్ చేశాయని షాలిని భావించడమే దీనికి ప్రధాన కారణం. అప్పటి నుంచి ప్రతి అవకాశం లోనూ నీతును టార్గెట్ చేయడం, ఆమె మాటలను చిన్న చూపు చూడటం చేస్తుండగా, రోహిత్ కూడా షాలినికి మద్దతుగా నిలుస్తూ నీతును కౌంటర్ చేస్తున్నాడు. షాలినిని నీతు ప్రతిసారీ చిన్నచూపు చూసేలా వ్యవహరించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
నామినేషన్ల సమయంలో షాలినికి, వంశీకి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి ఇద్దరూ ఒకరినొకరు ఇమిటేట్ చేసుకుంటూ హద్దులు దాటి మాట్లాడుకున్నారు. ఈ గొడవలోకి రోహిత్ ఎంట్రీ ఇచ్చి వంశీని నిలదీయడంతో వివాదం మరింత పెద్దదైంది. ఈ గొడవ మధ్యలోకి నీతు రాగా, షాలిని ఆమెను చాలా నిర్లక్ష్యంగా, చులకనగా మాట్లాడింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నీతు మండిపడగా, షాలిని మరింత రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించడంతో కోపం కట్టలు తెంచుకున్న నీతు నేరుగా రోహిత్‌ను పక్కకు జరగమని తోసేయడంతో షాలిని హర్ట్ అయింది.
అయితే ఈ వీకెండ్ లో మాత్రం ఈ విషయమై నాగార్జున చేతిలో షాలిని కి పెద్ద క్లాసే పడేలా ఉంది. పైగా రోహిత్‌ని నీతూ తమ్ముడు అని పిలవడం కూడా షాలినికి నచ్చలేదు. నిజానికి రోహిత్ దగ్గరకి ఎవర్నీ రానిచ్చే ప్రయత్నం కూడా షాలిని చెయ్యట్లేదు. చూస్తుంటే కచ్చితంగా నీతూ ఈ పెయిర్ మీదకి స్ట్రాంగ్ గా ఎటాక్ కి వెళ్తుందనిపిస్తుంది.
