Bigg Boss Telugu 10: వంశీ మాటలపై తల దించుకుంటున్నానని చెప్పిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 11వ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లకు గట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా వంశీ వాడిన అసభ్యకర పదజాలంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తలదించుకుంటున్నానని వ్యాఖ్యానించడంతో వంశీ క్షమాపణలు చెప్పాడు. వచ్చే వారం నేరుగా నామినేట్ అవుతూ పనిష్మెంట్ స్వీకరించాడు. మరోవైపు నీతూ నటరాజ్ ఎలిమినేషన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.
By: Priya Chowdhary Nuthalapti | 22 Nov 2026 4:09 PM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పదకొండో వారం వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్ ఆటతీరును సమీక్షిస్తూ తనదైన శైలిలో గట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా ఈ వారం జరిగిన 'డిక్టేటర్స్' గేమ్‌లో కంటెస్టెంట్లు వ్యవహరించిన తీరు, మరియు కొందరు ఉపయోగించిన అసభ్యకర పదజాలంపై నాగార్జున తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
గేమ్‌లో భాగంగా శివకుమార్ మరియు వర్షిణి సంచాలకులుగా వ్యవహరించిన టాస్క్, వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక రద్దయిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున స్పందిస్తూ "ఆ రోజు ఇద్దరి మధ్య కొద్దిగా రాజీ కుదిరి ఉంటే గేమ్ కొనసాగేది, మీరు గెలిచేవారు" అని అన్నారు. గేమ్‌లో వంశీ మరియు రామకృష్ణ ఇద్దరూ ఫౌల్ గేమ్ ఆడినప్పుడు, కేవలం వంశీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారని నాగార్జున నిలదీశారు.
ఈ ఎపిసోడ్‌లో అసలైన హైలైట్ వంశీపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేయడం. ఒక సందర్భంలో వర్షిణి మరియు ముఖేష్‌లను ఉద్దేశించి వంశీ అత్యంత దురుసుగా మాట్లాడిన వీడియో క్లిప్‌ను నాగార్జున హౌస్‌మేట్స్ అందరి ముందు ప్లే చేసి చూపించారు. అనంతరం నాగార్జున స్పందిస్తూ.. "గతంలో వంశీ 'కులకడం' అనే పదం వాడినప్పుడు నేను సపోర్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఈ మాటలు వింటుంటే.. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా నేను తలదించుకుంటున్నాను" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగార్జున మాటలతో తన తప్పు తెలుసుకున్న వంశీ వెంటనే హోస్ట్ నాగార్జునకు మరియు వర్షిణికి క్షమాపణలు చెప్పాడు. అంతే కాకుండా నెక్స్ట్ వీక్ డైరెక్టుగా నామినేట్ అవుతూ పనిష్మెంట్ ని స్వీకరించారు.
ఇక ఓటింగ్‌లో బాటమ్‌లో నిలిచిన వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ నీతూ నటరాజ్ మాస్టర్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. మరి డబుల్ ఎలిమినేషన్ వార్తల్లో నిజమెంత, మరో కంటెస్టెంట్ కూడా బయటకు వస్తారా అనేది ఆదివారం ఎపిసోడ్‌లో పూర్తిగా తేలనుంది!
