Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో తొమ్మిదో వారం నామినేషన్ల పర్వం ఊహించని మలుపులు తిరుగుతోంది.
By: Priya Chowdhary Nuthalapti | 3 Nov 2026 11:53 PM ISTబిగ్బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో తొమ్మిదో వారం నామినేషన్ల పర్వం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా ముఖేష్ గౌడ వ్యవహార శైలి, ప్రవర్తనపై హౌస్‌మేట్స్ అందరూ ఒక్కటై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుత ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నామినేషన్ల సమయంలో జరిగిన వాదనలు, ముఖేష్ చేసిన శపథం బాగా వైరల్ అవుతుంది. అయితే ఇలా అందరూ కలిసి ఒకేసారి మీద పడటంతో ముకేశ్ కూడా కాస్త ఎమోషనల్గా డవున్ అయ్యి మాటలు లూజ్ అయ్యాడు.
ముఖేష్ ప్రవర్తన, మాట తీరును తప్పు పడుతూ దేబ్జానీ ఆయనను డర్టీ మైండ్ ఉన్న వ్యక్తిగా, ప్రస్తావిస్తూ నామినేట్ చేసింది. టాస్క్‌లు, స్పీడ్, బ్యాలెన్స్ కంటే ప్రవర్తనే ముఖ్యమని దేబ్జానీ మండి పడింది. ఇంకో పక్కన శివ మరియు దేబ్జానీలను టార్గెట్ చేస్తూ ముఖేష్ మాట్లాడిన తీరుపై శివ తీవ్రంగా స్పందించాడు. గేమ్ కోసం, మూడు స్టార్ల కోసం ఎలా దిగజారి ప్రవర్తిస్తావని శివ ముకేశ్ని నిలదీశాడు.
ఈ గొడవలో త్రిగుణ్ జోక్యం చేసుకుంటూ ముకేశ్ మీదకి వెల్తూ అతనితో గొడవ పడ్డాడు. ఇక ఆ తర్వాత నామినేషన్స్ చేయడానికి వచ్చిన త్రిగుణ్, వర్షిణిని నామినేట్ చేస్తూ, ఆమె స్నేహానికి విలువ ఇవ్వలేదని, ఆమెకి ఉన్న ఎథిక్స్ జీరో అని చెప్తూ, మహిళలతో ఎలా మాట్లాడాలో ముకేశ్కి కూడా తెలియదని ఇద్దరినీ కడిగి పారేశాడు.
గత వారం ఎలిమినేట్ అయిన రోహిత్, గతంలో త్రిగుణ్‌ను ఉద్దేశించి "నిన్ను తొక్కుకుంటూ పైకొస్తాను" అని చెప్పిన డైలాగ్‌ను ముఖేష్ ఇప్పుడు తెరపైకి తెచ్చాడు. త్రిగుణ్‌తో వాదన సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ, రోహిత్ శపథాన్ని తను నిజం చేస్తా అని ఛాలెంజ్ చేసాడు.
ఇక హోటల్ టాస్క్‌లో తనకు డబ్బులు ఇవ్వలేదని వర్షిణి నరేష్‌ను నామినేట్ చేయగా.. ఆమె ఇతరుల కోసం ఆడుతోందని నరేష్ తిప్పికొట్టాడు. అంతే కాకుండా వర్షిణి ఇంతకు ముందు చెప్పినట్టు బిగ్బాస్ ఒక పర్సనాలిటీ షో అని ఆమె డైలాగ్ ని ఆమెకే తిప్పి కొట్టాడు. ఇక కామెడీ చేసినట్లు నటిస్తూ తెరవెనుక కన్నింగ్‌గా వ్యవహరిస్తున్నావంటూ వర్షిణిని రామ్‌ప్రసాద్ నామినేట్ చేశాడు. వీకెండ్ లో ఆమె రాసిన కామెంట్స్ చదువుతు ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చాడు.
రోహిత్ ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోగా, ముఖేష్‌ను టార్గెట్ చేస్తూ అందరూ ఒక వైపు నిలవడం ఆటను మరింత రసవత్తరంగా మార్చింది! ఈ దెబ్బకి ముకేశ్ హీరో అవుతాడో లేక జీరో అవుతాడో ఈ వారం తెలుస్తుంది.
