Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 67వ ఎపిసోడ్‌లో రామ్‌ప్రసాద్, జబర్దస్త్ నరేష్ కామెడీతో నవ్వులు పూయించారు. ఫ్యామిలీ వీక్‌లో ముఖేష్ తల్లి సులోచన, అమన్ తండ్రి మసూద్ హౌస్‌లోకి వచ్చారు. తల్లి ఇచ్చిన ధైర్యంతో ముఖేష్ భావోద్వేగానికి గురయ్యాడు. తదుపరి ఎపిసోడ్‌లో రామ్‌ప్రసాద్ కుటుంబం ఎంట్రీ ఇవ్వనుండగా, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   12 Nov 2026 8:53 AM IST
Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 67వ ఎపిసోడ్ ప్రారంభం నుంచే రామ్‌ప్రసాద్ మరియు జబర్దస్త్ నరేష్‌లు తమదైన కామెడీ టైమింగ్‌తో హౌస్‌మేట్స్‌ను కడుపుబ్బా నవ్విచ్చారు. వారి కామెడీకి ఏకంగా బిగ్‌బాస్ స్వయంగా స్పందిస్తూ మరింత ఫన్ యాడ్ చేయడం విశేషం. ఈ సీజన్‌లో నరేష్-రామ్‌ప్రసాద్‌ల కామెడీని బిగ్‌బాస్ కూడా ప్రత్యేకంగా ఆస్వాదిస్తూ వాళ్ళకి ఊహించని విధంగా సపోర్ట్ అందిస్తున్నాడు.

ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ముఖేష్ తల్లి సులోచన హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ భావోద్వేగానికి గురి చేశారు. ముఖేష్ పుట్టినరోజు ఆదివారం జరగడంతో ఆమె ప్రత్యేకంగా గులాబ్ జామ్‌లు తీసుకువచ్చి హౌస్‌మేట్స్ అందరికీ తన చేతులతో తినిపించారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరి గురించి ఒక్కో మంచి మాట చెబుతూ హౌస్‌లో పాజిటివ్ వైబ్స్ నింపారు.

ఆటలో ఓడిపోయినప్పుడు కోపం తెచ్చుకోవద్దని, బయట ఫ్యాన్స్, ఫ్రెండ్స్ చాలా ఇష్టపడుతున్నారని కొడుకు ముఖేష్‌కు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ముఖేష్ తన తల్లితో మాట్లాడూతూ.. వర్షిణి చాలా మంచి అమ్మాయి అని, ఎవరికీ చెడు తలపెట్టదని చెప్పాడు. వర్షిణి కూడా వచ్చి ముఖేష్ తల్లి పక్కన కూర్చుని భావోద్వేగానికి గురైంది. అంతే కాకుండా ఆవిడ ముకేశ్కి సుధీర్కి ఉన్న గొడవలు పక్కన పెట్టాలని చెప్పకనే చెప్పారు.

ఆ తర్వాత ముఖేష్ చెల్లెలు, బావ, మేనల్లుడు పంపిన వీడియో మెసేజ్ ముఖేష్‌ను మరింత ఎమోషనల్ చేసింది. సులోచన వెళ్లేటప్పుడు హౌస్‌మేట్స్ అందరూ కలిసి ఆమెతో కలిసి డ్యాన్స్ చేసి సంతోషంగా వీడ్కోలు పలికారు.

'బిబి స్కూల్' టాస్క్‌లో దెబ్జానీ తెలుగు టీచర్‌గా వచ్చి టంగ్ ట్రిప్పర్స్‌తో నవ్వులు పూయించింది. అయితే ఈ స్కిట్‌లో జబర్దస్త్ నరేష్ చేసిన కామెడీయే అసలైన హైలైట్. ఇక ఆ తర్వాత అమన్ తండ్రి మసూద్ హౌస్‌లోకి ప్రవేశించారు. ఒకప్పుడు అందరూ అమన్ ని మసూద్ కొడుకు అనే వారు కానీ ఇప్పుడు అందరూ ఆయన్ని అమన్ తండ్రిగా గుర్తిస్తున్నారు గర్వంగా చెప్పారు.

తదుపరి ఎపిసోడ్ లో రాంప్రసాద్ కుటుంబం హౌజ్లోకి ప్రవేశిస్తున్నారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందనే వార్తలు కూడా వస్తుండటంతో ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాల్సి ఉంది.