Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: కుటుంబాల ఎంట్రీ తర్వాత కెప్టెన్సీ టాస్క్ రగడ!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ భావోద్వేగంగా సాగింది. త్రిగుణ్ భార్య, కుమార్తె హౌస్‌లోకి రాగా, నీతూ మాస్టర్‌ను భర్త నటరాజ్ మాస్టర్, పిల్లలు కలిశారు. మరోవైపు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో త్రిగుణ్, శివ, అమన్ మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. చివరకు వంశీ, నరేష్, అమన్, రామకృష్ణ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   14 Nov 2026 9:00 AM IST
Bigg Boss Telugu 10: కుటుంబాల ఎంట్రీ తర్వాత కెప్టెన్సీ టాస్క్ రగడ!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌లు ఉద్వేగభరితంగా సాగుతుండగానే.. మరోవైపు హౌస్‌లో 'కెప్టెన్సీ రేసు' కోసం తీవ్రమైన పోటీ మొదలైంది. కుటుంబ సభ్యుల రాకతో ఇటు హౌస్‌లో సెంటిమెంట్ పండుతుంటే, అటు కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, టాస్క్ పోరాటాలు మరింత జోరందుకున్నాయి.

ఫ్యామిలీ వీక్‌లో భాగంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి కుటుంబం త్రిగుణ్‌ది. త్రిగుణ్ భార్య రాగానే తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేయడంతో త్రిగుణ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. త్రిగుణ్ తన చిన్నారి కూతురితో ఆడుకుంటూ ఆనందాన్ని పంచుకున్నాడు. ఎలాగైనా సరే ఈసారి ట్రోఫీ గెలుచుకుని ఇంటికి రావాలని ధైర్యం చెప్పింది త్రిగుణ్ భార్య. ఇక హౌస్‌లో వర్షిణి వల్ల తాను చాలా మనసు నొచ్చుకున్నానని త్రిగుణ్ తన భార్యతో పంచుకున్నాడు. చివరకు కుటుంబ సభ్యులందరూ చిన్నారి కూతురితో సరదాగా గడిపి, భావోద్వేగంగా వీడ్కోలు తీసుకున్నారు.

త్రిగుణ్ కుటుంబం తర్వాత నీతూ మాస్టర్ భర్త, ప్రముఖ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ తన ముగ్గురు పిల్లలతో కలిసి హౌస్‌లోకి అడుగు పెట్టారు. నీతూ, నటరాజ్ మాస్టర్‌ను చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. నటరాజ్ మాస్టర్ తన భార్యను ఓదారుస్తూ భరోసా ఇచ్చారు. అయితే నటరాజ్ మాస్టర్ హౌస్‌లో అందరితో మాట్లాడిన తీరు కొంత ఓవరాక్షన్‌గా అనిపించిందనే చర్చ నడిచింది.

ఇక "బిబి స్కూల్" టాస్క్‌లో అందరూ బాగా ఆడారంటూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లందరికీ కెప్టెన్సీ కంటెండర్లుగా పోటీపడే అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా నంబర్లు ఉన్న చిన్న చిన్న షీట్లను హౌస్‌లో ఉంచారు. బిగ్‌బాస్ నంబర్ అనౌన్స్ చేయగానే కంటెస్టెంట్లు ఆ షీట్ పై నిలబడాలి. ఎవరైతే నిలబడలేరో వారు ఎలిమినేట్ అవుతారు. చివరకు చివరి నలుగురు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తారు.

ఇక త్రిగుణ్ మరియు శివ షీట్ కోసం ఒకరినొకరు తోసుకుంటూ తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. అమన్, త్రిగుణ్ మధ్య కూడా తోపులాటలు జరిగాయి. చివరికి హోరాహోరీగా సాగిన ఈ టాస్క్‌లో వంశీ, నరేష్, అమన్ మరియు రామకృష్ణ లు తదుపరి స్థాయికి చేరుకున్నారు.