Begin typing your search above and press return to search.

హౌజ్ రెండో కెప్టెన్గా ముఖేష్‌!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో శుక్రవారం నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   26 Sept 2026 9:02 AM IST
హౌజ్ రెండో కెప్టెన్గా ముఖేష్‌!
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో శుక్రవారం నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 'అగ్ని పరీక్ష' లో పాల్గొన్న అపూర్వ, మిథిలేష్, రామకృష్ణలలో ఎవరు హౌస్‌లోకి వెళ్లాలనే దానిపై హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా నిర్ణయించారు. అయితే బిగ్‌బాస్ ఒక ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. అత్యధిక ఓట్లు వచ్చిన వారికే కాకుండా, వ్యూహాత్మకంగా తక్కువ/అనుకున్న ఓట్లు వచ్చిన వారి కోణంలో ప్రక్రియను నడిపించారు.

ఈ క్రమంలో అపూర్వ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మిగిలిన మిథిలేష్, రామకృష్ణలకు సమాన ఓట్లు రావడంతో, బిగ్‌బాస్ వారి మధ్య ఒక పోటీ పెట్టారు. ఈ పోటీలో గెలిచి మిథిలేష్ కూడా హౌస్‌లోకి అడుగు పెట్టాడు. అలా చివరకు అపూర్వ, మిథిలేష్ ఇద్దరూ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ప్రవేశించారు.

హౌస్‌లోకి వస్తూనే అపూర్వ, మిథిలేష్‌లకు బిగ్‌బాస్ ఒక ప్రత్యేక అధికారం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న కెప్టెన్సీ కంటెండర్లలో ఇద్దరిని తొలగించే పవర్‌ను వారికి అప్పగించారు. దీని వల్ల మిగిలిన కంటెండర్లు జంటగా ఆడి ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.

అపూర్వ, మిథిలేష్ చర్చించుకుని మొదట సృష్టి పేరును తొలగించారు. సుధీర్‌తో గొడవ పడినప్పుడు ఆమె వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆమె కెప్టెన్ అవ్వడానికి అనర్హురాలు అని ప్రకటించారు. అంతే కాకుండా రెండో వ్యక్తిగా అమన్ పేరును తొలగించారు. హౌస్‌లో అతను అంతగా అటెన్టివ్‌గా ఉండటం లేదని కారణం చెప్పారు. ఈ విషయంలోనే రోహిత్ ముందుకొచ్చి తన ఫ్రెండ్స్ కోసం స్టాండ్ తీసుకొనే ప్రయత్నం చేసాడు కానీ అతని ఆర్గ్యుమెంట్స్ లో పెద్దగా పస లేకుండా పోయింది.

ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరగగా.. ముఖేష్‌కి జోడీగా అపూర్వ, ఝాన్సీకి జోడీగా మిథిలేష్ తలపడ్డారు. చివరకు ముఖేష్, అపూర్వల జంట ఈ టాస్క్‌లో విజయం సాధించింది. దీనితో ముఖేష్ కొత్త కెప్టెన్‌గా ఎన్నికవ్వగా, అపూర్వ కూడా అతనితో సమానంగా ఇమ్యూనిటీని దక్కించుకుంది.