Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: రోహిత్ అండ్ గ్యాంగ్ కి నాగార్జున పనిష్మెంట్

శనివారం వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌కు గట్టిగానే మొట్టికాయలేశారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   18 Oct 2026 7:14 PM IST
Bigg Boss Telugu 10: రోహిత్ అండ్ గ్యాంగ్ కి నాగార్జున పనిష్మెంట్
X

శనివారం వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌కు గట్టిగానే మొట్టికాయలేశారు. ముఖ్యంగా తప్పులు పునరావృతం చేస్తున్న కంటెస్టెంట్లపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో మొదటగా నీతూకి గట్టి వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్ గా ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు.

వైల్డ్ కార్డ్ సభ్యులు బయటి విషయాలు హౌస్‌లో మాట్లాడకూడదనే రూల్ ఉన్నప్పటికీ, ఆమె రోహిత్‌తో తన కుటుంబ విషయాలు, బయటి మ్యాటర్స్ చర్చించడంపై నాగార్జున మండిపడ్డారు. దీంతో నీతు తన తప్పును క్షమించమని కోరింది.

ఆ తర్వాత షాలినిని కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన నాగార్జున.. ఆమె అమన్ మరియు రోహిత్‌లతో కలిసి నామినేషన్ల గురించి సీక్రెట్ డిస్కషన్స్ చేయడంపై నిలదీశారు. రూల్స్ బ్రేక్ చేసి నామినేషన్ల గురించి చర్చించినందుకు అమన్, షాలిని మరియు రోహిత్‌లకు భారీ షాక్ ఇస్తూ.. ఈ వారం వారు కెప్టెన్సీ కంటెండర్లుగా పోటీ పడే అర్హతను కోల్పోతున్నట్లు ప్రకటించారు.

గేమ్‌లో త్రిగుణ్‌పై షాలిని బూతు మాటలు మాట్లాడటంపై నాగార్జున తీవ్రంగా పరిగణించారు. తాను ఎలాంటి బూతులు మాట్లాడలేదని షాలిని కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే నామినేషన్ల సమయంలో ఉపయోగించిన ఆ అచ్చమైన పదాన్ని ఇప్పుడే ఇక్కడ రిపీట్ చేయాలని నాగార్జున స్ట్రాంగ్‌గా డిమాండ్ చేశారు. దీంతో తేరుకున్న షాలిని చివరికి తన తప్పును ఒప్పుకుని, కోపంలో అలా మాట్లాడేశానని వేడుకుంటూ క్షమాపణలు చెప్పింది.

మొత్తానికి శనివారం ఎపిసోడ్ అంతా తప్పులు చేసిన కంటెస్టెంట్లకు నాగార్జున పెట్టిన క్లాసులతోనే గడిచింది. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై చర్చిస్తానని నాగార్జున వెల్లడించారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు వచ్చిన ప్రోమో చూస్తే, అందులో క్లియర్గా అందరూ కలిసి దక్షిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. వచ్చిన వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ అందరిలో దక్షి ప్రదర్శన పేలవంగా ఉందన్న విమర్శలు గట్టిగా ఎదురవుతున్నాయి. చూడబోతే ఆమె డైరెక్ట్ ఎలిమినేషన్లో ఉండే అవకాశం కనిపిస్తుంది.