Bigg Boss Telugu 10: ఫిజికల్ టాస్క్‌లో అమన్ రికార్డ్ విన్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గురువారం ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 23 Oct 2026 8:52 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గురువారం ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 'GOAT' (Greatest of All Time) రేసు కోసం జరిగిన ఫిజికల్ టాస్క్ హౌస్‌లో తీవ్ర గొడవలకు, భావోద్వేగాలకు వేదికైంది.
రెడ్ జోన్‌లో ఉన్నవారు 'GOAT' అయ్యే అవకాశాన్ని కోల్పోగా.. కేవలం యెల్లో జోన్‌లో ఉన్న సభ్యులకు మాత్రమే ఆ అవకాశం దక్కింది. దీని కోసం బిగ్‌బాస్ ఒక కఠినమైన ఫిజికల్ వెయిట్-లిఫ్టింగ్ టాస్క్‌ను పెట్టారు. ఈ గేమ్‌లో భాగంగా యెల్లో జోన్ సభ్యులందరూ తమ భుజాలపై ఒక కర్రను మోయాల్సి ఉంటుంది. బజర్ మోగిన ప్రతిసారీ, బిగ్‌బాస్ ఇచ్చిన నంబర్ ఆధారంగా మిగిలిన సభ్యులు వచ్చి ఆ కర్రపై బరువులు పెట్టాలి. ఎవరు ఎవరికి బరువులు పెట్టాలనేది ఆ కంటెస్టెంట్ ఇష్టాని బట్టి ఉంటుంది.
బరువులు పెరుగుతున్న కొద్దీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా తట్టుకోలేక వెనకడుగు వేశారు. మొదట వర్షిణి, ఆ తర్వాత నీతు, శివకుమార్, త్రిగుణ్ బరువులను మోయలేక అవుట్ అయ్యారు. మహిళల్లో దెబ్జానీ ఎక్కువ సేపు బ్యాలెన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
చివరికి రామ్‌ప్రసాద్, అమన్, నరేష్‌లు మిగిలారు. నరేష్‌పై ఎవరూ పెద్దగా బరువులు వేయకపోవడంతో అతను సేఫ్‌గా చివరి వరకు వచ్చాడు. కానీ అమన్‌పై విపరీతమైన బరువులు మోపినప్పటికీ, విపరీతమైన నొప్పులను భరిస్తూ అతను చివరి వరకు పోరాడాడు. చివరిలో ముఖేష్ వేసిన బరువును తట్టుకోలేక అమన్ కుప్పకూలి పోయాడు. హౌస్‌లో తనకు ఎవరూ సపోర్ట్ లేరని భావించి అమన్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
టాస్క్ చివరకు వచ్చేసరికి చివరి వరకు నిలబడిన నరేష్ గెలిచాడని అందరూ అనుకున్నారు. కానీ బిగ్‌బాస్ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. నరేష్ చివరి వరకు ఉన్నప్పటికీ ఎవరూ అతనికి బరువులు పెట్టలేదని, కానీ అమన్ అందరికంటే ఎక్కువ బరువులను అత్యధిక సమయం పాటు మోశాడని బిగ్‌బాస్ స్పష్టం చేశారు.
దీంతో అమన్‌ను ఈ టాస్క్ విజేతగా ప్రకటించారు. అమన్ నేరుగా గ్రీన్ జోన్‌లోకి వెళ్లి 'GOAT' గా నిలిచాడు. అంతేకాకుండా, మహిళల్లో అత్యధిక సమయం పాటు బరువులను మోసి పోరాడిన దెబ్జానీ మరియు నీతులకు కూడా బిగ్‌బాస్ అరుదైన అవకాశం ఇచ్చారు. వారిని కూడా గ్రీన్ జోన్‌లోకి ప్రమోట్ చేశారు.
